సినీ పరిశ్రమలో ఇటీవల చాలా మంది మరణించారు. దర్శకురాలు అపర్ణ మల్లాదితో మొదలు సీనియర్ నటుడు (Actor ) విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి, సీనియర్ నటి పుష్పలత, మలయాళ నటుడు అజిత్ విజయన్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తండ్రి, లెజెండరీ పాప్ సింగర్ రాబెర్టా ఫ్లాక్ వంటి వారు కన్నుమూశారు.
ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోలేదు. అప్పుడే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఓ నటుడు తన భర్త సహా చచ్చి పడి ఉన్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే…హాలీవుడ్ సీనియర్ మోస్ట్ హీరో, రెండు సార్లు ఆస్కార్ అవార్డులు అందుకున్న జీన్ హ్యాక్ మ్యాన్ మరణించారు. ఇక్కడ షాకిచ్చే విషయం ఏంటంటే.. జీన్ తో పాటు అతని భార్య అలాగే ప్రముఖ పియానిస్ట్ అయినటువంటి బెస్టీ అరకావా కూడా అతనితో పాటు చచ్చి పడి ఉంది.
బుధవారం నాడు శాంటా ఫే లో ఉన్న తమ నివాసంలో జీన్,బెట్సీ..లతో పాటు వారి పెంపుడు కుక్క కూడా చచ్చి పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిది హత్యే అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. జీన్ కి 95 ఏళ్ళు, బెట్సీకి 63 ఏళ్ళు. వీరు బలహీనులు కావడంతో కావాలనే కొందరు ఎటాక్ చేసి వీరి ప్రాణాలు తీసి ఉండొచ్చు అని పోలీసులు చెబుతున్నారు.
కానీ అది దేని కోసం అనేది విచారించాలని వారు తెలిపారు. ఇక జీన్ .. ‘ది ఫ్రెంచ్ కనెక్షన్’ ‘అన్ ఫర్గివెన్’ వంటి సినిమాలకి గాను జీన్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. ఇక అతని మృతికి చింతిస్తూ కొందరు హాలీవుడ్ నటులు.. జీన్ అలాగే ఆమె భార్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి న్యాయం జరగాలని కోరుకుంటూ సంతాపం తెలుపుతున్నారు.