తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటిమనీ జమున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అందరికి సరసన నటించి సుమారు 200కు పైగా సినిమాలలో నటించిన ఈమె నేడు తుది శ్వాస విడిచారు. వయసు పై పడటంతో నేడు ఉదయం జమున తన స్వగృహంలోనే మరణించారు. ఇలా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన జమున భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆమె సంపాదించినది
మొత్తం కూడా పెట్టడమే కాకుండా తనకు ఇష్టమైన విధంగా తన జీవితాన్ని గడిపేవారు. తన కోరిన నగలు కొనుగోలు చేశారు. ఇక జమున పెట్ లవర్. ఎన్నో రకాల జంతువులను ఈమె పెంచడమే కాకుండా వాటి ఆహారం కోసం కూడా భారీగా ఖర్చు చేసే వారట.ఇక జమున ఆస్తుల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న ఇల్లు 2000గజాలతో నిర్మితమై ఉందట అన్ని అధునాతన సౌకర్యాలతో ఈ ఇల్లు నిర్మించారని తెలుస్తుంది.
ఈ ఇంటి విలువ దాదాపు కొన్ని కోట్లలో విలువ చేస్తుందని సమాచారం. ఈ ఇల్లు మాత్రమే కాకుండా ఈమెకు హైదరాబాద్లోనే మరొక పాత బంగ్లా కూడా ఉందని సమాచారం. ఇది మాత్రమే కాకుండా కొండాపూర్ లో ఖరీదైన ఫ్లాట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.ఇలా ఈమె సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయ రంగంలో కూడా భారీగానే డబ్బు కూడా పెట్టారని చెప్పాలి.
ఇక జమున జూలూరు రమణారావు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేసేవారు వీరికి స్రవంతి వంశీ అనే ఇద్దరు పిల్లలు కలరు.