విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఈ మూవీ మేకర్స్ సైతం సంతోషంగా ఉన్నారు. అయితే రిలీజైన నెల రోజులకే ఈ సినిమా తమిళనాడులోని 100 థియేటర్లలో రీ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సినిమా రిలీజైన తక్కువ సమయంలోనే ఈ విధంగా థియేటర్లలో రీ రిలీజ్ కావడం లియో విషయంలో మాత్రమే జరిగిందని
లియో ఖాతాలో ఈ విధంగా అరుదైన ఘనత చేరిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. లియో మూవీ రీ రిలీజ్ లో సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లియో సినిమా సెకండాఫ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
లియో మూవీకి (LEO Movie) సీక్వెల్ తెరకెక్కుతుండగా సీక్వెల్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. విజయ్ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా మరీ భారీ రేంజ్ హిట్లు అయితే కావడం లేదు. ఈ రీజన్ వల్లే ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు. విజయ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాల్సి ఉంది.
విజయ్ పారితోషికం మాత్రం సినిమా సినిమాకు పెరుగుతోంది. ఒక్కో సినిమాకు 120 కోట్ల రూపాయల రేంజ్ లో విజయ్ పారితోషికం ఉంది. విజయ్ రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. విజయ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!