‘అ!’ సినిమా చెప్పిన పాఠాలు

  • February 20, 2018 / 01:19 PM IST

‘అ!’ చిత్ర కథ కేవలం విన్నూతనమైనదే కాదు… సందేశాలతో నిండిన స్టోరీ. అనేక సున్నితమైన అంశాలను వెండితెరపైన ఆలోచింపచేసేలా చూపించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. అందులోనే యువతకు కొన్ని సందేశాలు ఇచ్చారు. వాల్ పోస్టర్ బ్యానర్ పై నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ మూవీ గత శుక్రవారం రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. చిన్న, పెద్ద, సామాన్యుడు, సెలబ్రిటీ అనే భేదం లేకుండా అభినందనలు కురిపిస్తున్నారు. నిత్యా మీనన్‌, కాజల్‌ అగర్వాల్, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్‌ తదితరులతో డైరక్టర్ చెప్పిన పాటలు ఏమిటంటే..

అమ్మాయి తీరు వెనుక నిజం ఒక అమ్మాయిని తప్పుగా చూసే ముందు ఆమె ఎదుర్కుంటున్న కష్టాలు ఆలోచించాలి.

ఎదిగిన ఒదిగుండు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పొగరు ఉండకూడదు. అందరికన్నా గొప్పవాడు దేవుడు.

చిత్తు చేసే మత్తుమత్తులో మునగటం వల్ల చాలా కోల్పోతాము. వ్యసనాలకు దూరంగా ఉండడం మేలు.

సాయం మరువకుమనకు సాయం చేసిన వాళ్లకి ఎప్పుడూ రుణపడి ఉండాలి.

మంచి వాడికి చెడు చేతకాదుమంచి వాడు ఎంత చెడ్డగా మారుదాం అనుకున్నా… అతనిలోని మంచితనం అడ్డుపడుతుంది.

మీరు ఈ చిత్రం నుంచి ఏమైనా గ్రహించి ఉంటే కామెంట్ చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus