తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ వైజాగ్ లో ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కుందనపు బొమ్మ,సెకండ్ హ్యాండ్ అనే చిత్రాల ద్వారా హీరోగా సందడి చేసిన సుధీర్ వర్మ వైజాగ్ లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఈ విధంగా ఈయన మరణ వార్త తెలియడంతో ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఈయన మరణ వార్త స్పందించి తనకు నివాళులు అర్పించారు.
ఈ క్రమంలోనే కుందనపు బొమ్మ హీరోగా చేసినటువంటి మరొక నటుడు సుధాకర్ కోమాకుల ఈ విషయంపై స్పందిస్తూ సుదీర్ లేరనే వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్న అనంతరం నటుడు సుధీర్ వర్మ మృతదేహాన్ని విశాఖపట్నంలోని ఎల్జి హాస్పిటల్ కి తరలించారు.
అనంతరం వైద్యులు తన డెత్ రిపోర్ట్స్ విడుదల చేశారు. అయితే ఈ రిపోర్టులో భాగంగా సుదీర్ వర్మ విషం తాగి మరణించారని వైద్యులు తెలియజేశారు. వ్యక్తిగత కారణాలవల్ల సుధీర్ చనిపోయారని అందరూ భావించగా కుటుంబ సభ్యులు మాత్రం ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించారు. ఈ విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి సుధీర్ వర్మ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది.
ప్రస్తుతం సుదీర్ వయసు 34 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా తనకు పెళ్లి కాలేదని తెలుస్తోంది.ఇలా నటుడు సుధీర్ విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.అనారోగ్య సమస్యల కారణంగానే ఈయన ఈ అగాయిత్యానికి పాల్పడ్డారా లేక ఆర్థిక సమస్యలు ఏమైనా వెంటాడుతున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.