యూత్‌స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి). ఈ చిత్రం షూటింగ్ అమెరికాలోని డిఫరెంట్ లొకేషన్స్‌లో 60 రోజులుగా జరుగుతోంది. ఇప్పటివరకు ఎవరూ షూట్ చెయ్యని రేర్ లొకేషన్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఎంతో భారీ ఎత్తున చిత్రీకరించారు.
ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర తెలియజేస్తూ – ”నితిన్ కెరీర్‌లో ఓ డిఫరెంట్ మూవీగా ‘లై’ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం అమెరికాలోని రేర్ లొకేషన్స్‌లో యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరించడం జరిగింది. ఎలినెవేడాలో ఒక యాక్షన్ సీక్వెన్స్, లాస్ వెగాస్‌లో మరో యాక్షన్ సీక్వెన్స్ చేశాం. కాలిఫోర్నియాలోని మొజావేలో వున్న మిడెస్ట్‌లో 1000 ఫ్లైట్స్ మధ్యలో క్లైమాక్స్‌ను చాలా గ్రాండ్‌గా తీశాం. వారం రోజులపాటు జరిగిన ఈ యాక్షన్స్ సీక్వెన్స్‌లు ఫైట్‌మాస్టర్ కెచ్చా నేతృత్వంలో షూట్ చేశాం. అలాగే ఒక ఛేజ్‌ను హాలీవుడ్ ఫైట్‌మాస్టర్ జెఫ్రీ ట్రాయ్ జెయ్ కంపోజ్ చేశారు. ఈ ఛేజ్ ఆడియన్స్‌ని థ్రిల్ చేసేలా అద్భుతంగా వచ్చింది. మరో ఛేజ్‌ను స్టన్ శివ చేశారు. ఇవి కాక మరో యాక్షన్ సీక్వెన్స్‌ను హాలీవుడ్ మూవీ ‘ట్రాన్స్‌ఫార్మర్స్’ని షూట్ చేసిన డోనాల్డ్ ట్రంప్‌కి చెందిన ట్రంప్ టవర్స్‌లో చిత్రీకరించాం..
సాంగ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. జూన్ 7 నుండి 11 వరకు చికాగోలోని డౌన్‌టౌన్‌లో 1 పాటను తియ్యబోతున్నాం. జూన్ 14తో ఈ అమెరికా షెడ్యూల్ పూర్తవుతుంది. నితిన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. నితిన్ పెర్‌ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా హైలైట్ అవుతుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌ను చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. నితిన్ కెరీర్‌లో ఇది ఒక ఎక్స్‌ట్రార్డినరీ మూవీ అవుతుంది. అలాగే కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ సినిమాగా నిలుస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.