Gowra Hari: స్టేషన్‌లో పడక.. ప్రసాదమే భోజనం.. ‘మిరాయ్‌’ మ్యూజిక్‌ డైరక్టర్‌ లైఫ్‌ ఇదీ!

తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పుడంటే ‘హంగ్రీ చీతా..’ అంటూ హమ్‌ చేస్తున్నారు కానీ.. మొన్నీమధ్య వరకు ‘వైబ్‌ ఉంది..’ అంటూ ఓ సాంగ్‌కి తెగ డ్యాన్స్‌లు చేశారు. రీల్స్‌ చేశారు. ఆ పాటకు అంత వైబ్‌ రావడానికి కారణం డ్యాన్స్‌ స్టెప్పులు కాగా.. దాని కంటే ముందుది ఆ పాట బీట్‌. దీన్ని ఇచ్చింది కొత్త సంగీత దర్శకుడు గౌర హరి. ‘హను – మాన్‌’ సినిమాతో ఇప్పటికే తనను తాను ప్రేక్షకుల ముందు పరిచయం చేసుకుని భారీ విజయమే దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన అనుభవిస్తున్న ఈ ఆనందం వెనుక చాలా కష్టాలే ఉన్నాయి.

Gowra Hari

‘మిరాయ్‌’ సినిమా విజయం ఇచ్చిన ఆనందంలో ఉన్న గౌర హరిని ఇటీవల ఓ మీడియా సంస్థ పలకరించగా ఆయన తన జీవితం గురించి చెప్పుకొచ్చారు. అందులో కొన్ని ఆసక్తికర అంశాలు.. ఎవరూ ఊహించని విషయాలు ఉన్నాయి. తునికి చెందిన గౌర హరికి చిన్నతనంలో కలిగిన బాధని, దాని వల్ల పుట్టిన ఉద్వేగాన్నీ తొలిసారిగా కవితగా రాశారు. ఆ తర్వాత అది కొనసాగుతూ వచ్చింది. ఇంటర్‌కి వచ్చేసరికి సినిమా పాటల్ని, బాణీల్లో సిద్ధం చేశారు. వాటిని స్నేహితులు విని సినిమాల్లోకి వెళ్లమని చెప్పేవారట. ఆ సమయంలో డ్యాన్సర్‌ అవ్వాలని అనుకున్నారు గౌర హరి.

అలా భాగ్యనరం వచ్చిన ఆయన.. చేతిలో డబ్బులు లేకపోవడంతో సికింద్రాబాద్‌ రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే నిద్రపోయేవారు. పక్కనే ఉన్న వినాయకుడి ఆలయంలో ప్రసాదం తిని అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారట. రోజుల తరబడి నీళ్లు, ప్రసాదంతో కడుపునింపుకోవడంతో అతనితో వచ్చిన ఫ్రెండ్‌ ఆరోగ్యం చెడిపోయింది. దీంతో తిరిగి ఇద్దరూ ఇంటికెళ్లిపోయారు. ఇంట్లో వాళ్లు హరి వాలకం చూసి.. ‘ఇంటర్‌ పూర్తిచెయ్‌… తర్వాత సంగీతం’ అన్నారట. అలా ఇంటర్‌ పాసయ్యాక రూ.2 వేలు పెట్టి గిటార్‌ కొనిపెట్టారట. కొన్ని రోజులకు గిటార్‌ ప్లే చేయడం నేర్చుకున్నారు.

ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌ వచ్చారు. అప్పుడు కూడా అవకాశాలు రాకపోవడంతో నైట్‌ వాచ్‌మన్‌గా కూడా పని చేశారు. పగటిపూట ఇందిరా నగర్‌ కూడలిలో నిలబడి గిటార్‌ వాయిస్తుంటే ఓ ఫ్రెండ్‌ చూసి దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్‌ నారాయణ దగ్గరకు తీసుకెళ్లాడట. అలా అతని టీమ్‌లో చేరారట. రెండేళ్ల తర్వాత మరో మ్యూజిక్‌ డైరక్టర్‌ దగ్గర నెల జీతానికి చేరారు. అయితే అతను హరి ట్యూన్స్‌ని తనవి అని చెప్పకునేవారట. ఆ సమయంలోనే తల్లికి అనారోగ్యం రావడంతో అటు వెళ్లిపోయారట. ఆ తర్వాత ‘తుంగభద్ర’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ లాంటి సినిమాలు చేశారు. వాటి తర్వాత ‘హను – మాన్‌’ ఛాన్స్‌ వచ్చింది. ఆ సినిమాకు మంచి పేరు రావడంతో ‘మిరాయ్‌’ సినిమాలో అవకాశం వచ్చింది.

యాక్షన్‌ హీరోతో యాక్షన్‌ నాయికగా బాలీవుడ్‌కి.. మీనాక్షి పవర్‌ఫుల్‌ ప్లాన్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus