‘టాక్సీ వాలా’ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ రెండు సినిమాలు నిరాశపరిచాయి. ఈ ప్లాప్ లను మరిపించి మాస్ హీరోగా ఎదగాలని ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తో ఫామ్లోకి వచ్చిన పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు విజయ్ దేవరకొండ. ‘ఇస్మార్ట్ శంకర్’ కు ముందు మిడ్ రేంజ్ హీరోలు కూడా పూరీని నమ్మడం మానేశారు. విజయ్ దేవరకొండ కూడా పూరికి అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చింది లేదు.
‘టాక్సీ వాలా’ తర్వాత పూరి.. విజయ్ ఎన్నో ప్రదక్క్షణాలు చేశాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయితే కానీ పూరీని విజయ్ నమ్మలేదు. ఆ టైంలో విజయ్ కు ప్లాపులు ఉండడం కూడా పూరీని విజయ్ నమ్మేలా చేసాయి అనుకోవచ్చు.మొదట రూ.30 కోట్లతో తీయాలి అనుకున్న ఈ ప్రాజెక్టు.. తర్వాత రూ.70 కోట్ల రేంజ్ కు వెళ్ళింది. అటు తర్వాత లాక్ డౌన్ పుణ్యమా అని రూ.120 కోట్లయ్యింది.
పూరి- విజయ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ గా రూపొందిన ఈ మూవీ మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది అని చెప్పాలి. విజయ్ దేవరకొండ ని పూరి నిండా ముంచేశాడు అంటూ రౌడీ ఫ్యాన్స్ పూరిని టార్గెట్ చేస్తున్నారు. సినిమా ఏ రకంగానూ కోలుకునేలా లేదు అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు డిజాస్టర్ ఎంట్రీ ఇది అని అంతా అంటున్నారు.
నిజానికి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఆమె టైం బాగుండో.. అనన్య టైం బాగోకో .. ఫైనల్ గా ఇలా జరిగింది. విజయ్ ను పూరి కోలుకోలేని దెబ్బ కొట్టాడు అనేది విజయ్ ఫ్యాన్స్ ఆరోపణలు. టాక్ బాగుంటే ఈ సినిమా మొదటి వారమే బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేది. ఇప్పుడైతే కష్టమే మరి.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?