ఇష్మార్ట్ శంకర్ తో హిట్టు కొట్టి ఫాంలోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్… తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ చిత్రాన్ని మొదలుపెట్టాడు. మొదట మీడియం బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించాలి అనుకున్న పూరి… తర్వాత బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ తో చేతులు కలిపి దీనిని పాన్ ఇండియా చిత్రంగా మలిచారు.తన ప్రతీ సినిమాకి.. ప్రమోషనల్ కంటెంట్ తో భీభత్సమైన హైప్ ను క్రియేట్ చేయడం పూరీకి కేక్ వాకే.
కానీ సరైన టాక్ రాకపోతే సినిమాలు తేడా కొట్టేస్తూ ఉంటాయి. లైగర్ బోలెడంత హైప్ వచ్చింది. పూరి మార్క్ ప్రమోషనల్ కంటెంట్ వర్కౌట్ అయ్యింది. విజయ్ దేవరకొండ కొండ సినిమాలకు కూడా రిలీజ్ కు ముందు భారీ హైప్ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి.. లైగర్ ఈ విషయంలో పాస్ మార్కులు వేయించుకుంది. ఆగస్టులో 3 హిట్ సినిమాలు పడ్డాయి. అది కూడా లైగర్ కు బాగా కలిసొచ్చి ఏకంగా రూ.90 కోట్ల బిజినెస్ జరగడానికి దోహద పడింది.
ఇప్పుడున్న హైప్ తో లైగర్ మొదటి రోజు రూ.10 కోట్ల షేర్ ను రాబట్టడం ఖాయమనే చెప్పాలి. కాకపోతే టికెట్ రేట్లే కాస్త కలవరానికి గురి చేస్తున్నాయి. స్టార్ హీరో సినిమాలు రిలీజ్ చేస్తున్నట్టే లైగర్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కానీ టికెట్ రేట్లు మాత్రం తగ్గించింది లేదు. సింగిల్ స్క్రీన్స్ లో రూ.175, మల్టీ ప్లెక్సుల్లో రూ.200, రూ.250 అన్నట్టే ఉన్నాయి టికెట్ రేట్లు.
వీకెండ్ వరకు ఓకె కానీ వీకెండ్ తర్వాత సినిమా నిలబడాలి అంటే టికెట్ రేట్లు తగ్గించాలి. సామాన్యులకు సినిమాని అందుబాటు రేట్లలో ఉంచాలి. ఈ విషయం పై పూరి అండ్ టీమ్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే చెప్పాలి. లేదంటే ప్రేక్షకులకు హిట్ సినిమాలు ఆప్షన్ ఎలాగూ ఉంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?