Liger Twitter Review: విజయ్ దేవరకొండ వన్ మెన్ షో!

  • August 25, 2022 / 08:42 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. పూరి, ఛార్మీ, కరణ్ జోహార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25 న.. ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్, అక్డి పక్డి సాంగ్ సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేశాయి. ఇక ఈ చిత్రాన్ని చూసిన కొంతమంది ఓవర్సీస్ ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వారి టాక్ ప్రకారం.. ఓ చాయ్ వాలా తన అమ్మ ఇచ్చిన స్ఫూర్తి తో ఇండియా లెవెల్లో గర్వించదగ్గ బాక్సర్ ఎలా అయ్యాడు. ఈ జర్నీ లో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అన్న పాయింట్ తో సినిమా తెరకెక్కింది. కథలో కొత్తదనం ఏమీ లేదట .. కంప్లీట్ గా విజయ్ హీరోయిజం పై నడిచిన మూవీ ఇదని తెలుస్తుంది. అయితే పాటలు, ఫైట్లు ప్లస్ పాయింట్ లు అని తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ కోసం ఒకసారి చూడదగ్గ సినిమా అని చెబుతున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. మరి తెలుగులో మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ బయటకు వస్తుందో చూడాలి

‘లైగర్’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus