Liger First Review: ‘లైగర్’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

  • August 24, 2022 / 07:05 PM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై అభిమానులలోను అటు చిత్ర బృందంలోనూ ఎంతో ఆందోళన నెలకొంది.ఇప్పటికే సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో విజయ్ దేవరకొండ ఉన్నారు. అలాగే ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సందు ఈ సినిమా ఫస్ట్ రివ్యూని ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రతి ఒక్కరి చేత విజిల్స్ వేయించే మాస్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఈయన తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. సినిమా మొత్తం విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షోగా సినిమాని నడిపించారని చెప్పాలి.

విజయ్ దేవరకొండ అన్ని సన్నివేశాలలోను ఎంతో అద్భుతంగా నటించారని,కళ్ళు చెదిరే యాక్షన్ సన్ని వేషాలు, అదిరిపోయే డైరెక్షన్, రమ్యకృష్ణ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇలా ప్రతి ఒక్కటి సినిమాకి హైలైట్ అయ్యాయని చెప్పాలి. అయితే కథ స్క్రీన్ ప్లే మాత్రం యావరేజ్ గా ఉందంటూ ఈయన తన ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఈ విధంగా లైగర్ సినిమాకు ఉమైర్ సందు ఇచ్చిన రివ్యూ చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఈయన ఈ సినిమా గురించి పాజిటివ్ రివ్యూ ఇవ్వడమే కాకుండా ఇప్పటికే ప్రతి ఒక్క చోట సినిమా టికెట్లు కూడా ఫుల్ అవడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేయబోతుంది ఈ క్రమంలోనే అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus