Liger: సెంటిమెంట్లకు ‘లైగర్‌’ టీమ్‌ భయపడిందా?

  • August 23, 2022 / 12:35 PM IST

సినిమా విడుదల అంటే.. శుక్రవారం అనే మాట చాలా ఏళ్లుగా ఉంది. దేశంలో చాలా సినిమాలు ఇలానే విడుదలవుతూ ఉంటాయి. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. శుక్రవారం విడుదలైతే.. వారాంతంలో ఆ సినిమాను చూస్తారు దాని వల్ల ప్రారంభ వసూళ్లు బాగుంటాయి అని అంటుంటారు. అయితే శుక్రవారం విడుదలకు సెంటిమెంట్లు కూడా ఉన్నాయి అని చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్‌కే ‘లైగర్‌’ టీమ్‌ తలొగ్గుతోందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

మీరు విన్నది కరెక్టే అండ్‌ పైన మేం టైటిల్‌ చెప్పింది కరెక్టే అంటున్నారు. ‘లైగర్‌’ సినిమాను ఈ నెల 25న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజు సినిమా హిందీలో విడుదల చేయడం లేదట. హిందీ ‘లైగర్‌’ను గురువారం కాకుండా శుక్రవారం విడుదల చేయాలని చూస్తున్నారట. అలా అని బాలీవుడ్‌లో సినిమా 25న రాదా అంటే వస్తుంది అని అంటున్నారు. అంటే 25న రాత్రి ముంబయిలో పెయిడ్‌ ప్రీమియర్లు వేస్తారట.

అంటే బాలీవుడ్‌లోని అగ్ర నటులు, సాంకేతక నిపుణులను ఆ షోకి తీసుకురావాలని నిర్మాత కరణ్‌ జోహార్‌ చూస్తున్నారట. దాని వల్ల సినిమాకు రెండు లాభాలు ఉంటాయని భావిస్తున్నారట. ఒకటి ఇతర భాషల్లోకి డివైడ్‌ టాక్‌ వెళ్లకుండా చూడటం ఒకటైతే.. రెండోది బాలీవుడ్‌లో హైప్‌ పెంచుకోవడం అని అంటున్నారు. మరోవైపు శుక్రవారం సెంటిమెంట్‌ కారణంగానే సినిమాను 25న బాలీవుడ్‌లో రిలీజ్‌ చేయడం లేదు అని కూడా చెబుతున్నారు.

అయితే పాన్‌ ఇండియా సినిమా ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు విడుదల అవ్వడం అంటే ఆశ్చర్యకరమే అని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే 25వ తేదీన ఉదయం 7 నుండే షోలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే సినిమా టికెట్‌ ధరల విషయమై ఇప్పటివరకు ఎక్కడా ఎవరూ మాట్లాడటం లేదు. కారణం సినిమాకు టికెట్‌ రేట్లు భారీగా పెట్టడమే. మల్టిప్లెక్స్‌లో సినిమా చూడాలంటే మనిషికి 400 రూపాయలకే పైనే వదులుతుంది. సింగిల్‌ స్క్రీన్స్‌ అయితే రూ. 200 చెల్లించాల్సిందే.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus