కేసు గెలిచి ఊపిరి పీల్చుకున్న విశాల్.. ‘మార్క్ ఆంటోని’ విడుదలకు లైన్ క్లియర్

తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ సినిమాపై బ్యాన్ విధిస్తూ మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో హీరో విశాల్ గోపురం ఫిల్మ్స్ వద్ద రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని చెల్లించనందున ‘లైకా ప్రొడక్షన్’ సంస్థ చెల్లించడం జరిగింది. ఎందుకంటే విశాల్ నిర్మాణంలో రూపొందిన సినిమాలను ‘లైకా’ ఇచ్చేందుకు అతను అగ్రిమెంట్ పై సైన్ చేశాడు. కానీ ‘సామాన్యుడు’ సినిమా హక్కులు వాళ్ళకి ఇవ్వలేదు.

దీంతో మద్రాసు హైకోర్టులో కేసు వేసింది లైకా సంస్థ. అందుకే ‘మార్క్ ఆంటోనీ’ సినిమాకి అడ్డంకులు ఏర్పడ్డాయి అంటూ ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడు ‘మార్క్ ఆంటోనీ’ కి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయట.మార్క్ ఆంటోనీ విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. విశాల్ తో లైకా వారు కూర్చుని.. ఈ ఇష్యూని సాల్వ్ చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇక ఏ అడ్డంకులు లేకుండా..

సెప్టెంబర్ 15న ‘మార్క్ ఆంటోని’ చిత్రం రిలీజ్ కాబోతుంది అంటూ హీరో విశాల్ ట్వీట్ చేయడం జరిగింది. ఇక ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా.. ఆ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో కాస్తో కూస్తో బజ్ ఉంది ఈ సినిమాకే అని చెప్పాలి. టీజర్, ట్రైలర్స్ కి రెస్పాన్స్ బాగానే వచ్చింది. విశాల్ రకరకాల గెటప్లలో కనిపించి.. అందరిలో క్యూరియాసిటీని పెంచాడు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus