తల్లి అయిన మహేష్ హీరోయిన్!

భారత్ లోని  అందమైన మోడల్స్ లో లీసారే ఒకరు. హీరోయిన్ గా అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈమె టక్కరిదొంగ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆడిపాడింది. ఏమిదేళ్ళ క్రితం ఆమెకు క్యాన్సర్ వచ్చింది. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు కంగారుపడ్డారు. లీసారే మాత్రం ఆందోళన చెందకుండా దైర్యం గా ట్రీట్ మెంట్ తీసుకొని క్యాన్సర్ ని తరిమి కొట్టింది. ఆ తర్వాత 2012లో మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ జాసన్ ను కాలిఫోర్నియాలో పెళ్లాడింది. అప్పట్నుంచి పిల్లల కోసం వాళ్లు చేయని ప్రయత్నం లేదు. కాన్సర్ కారణంగా గర్భం దాల్చడానికి ఇష్టపడలేదు లీసారె.

అందుకే సరోగసీ ద్వారా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. సరోగసీపై కూడా చాలా రీసెర్చ్ చేసి, ఫైనల్ గా ఈ ప్రక్రియకు చట్టబద్ధత కల్పించిన జార్జియాలో పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఈరోజు లీసారె ఎనౌన్స్ చేసింది. తన ఇద్దరు పిల్లలతో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పిల్లలకు సూఫీ, సోలెల్ అని పేర్లు పెట్టింది. 46 ఏళ్ల లీసారే భర్తతో కలిసి టొరంటోలో నివసిస్తున్న ఈమె త్వరలోనే స్వదేశానికి వచ్చి సెటిల్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus