మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాల లిస్ట్..!

  • June 7, 2022 / 06:20 PM IST

ఏ సినిమాకి అయినా విడుదలైన మొదటి 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. వాటి పైనే ఆ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అనే విషయాన్ని అంచనా వేయగలం. వీక్ డేస్ … ఎలాగూ వర్కింగ్ డేస్ కాబట్టి కలెక్షన్లు తగ్గుతాయి. మళ్ళీ వీకెండ్ వచ్చేవరకు అవి పికప్ అవ్వవు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకి కొన్ని అడ్వాంటేజ్ లు ఉన్నాయి. ఈ సినిమాలకి బిజినెస్ పెద్ద సినిమాల్లా భారీ స్థాయిలో జరగదు.

కాబట్టి ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా వీకెండ్ వరకు బాగా క్యాష్ చేసుకుంటాయి. దాంతో మొదటి వారం పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అదేంటో కానీ కొన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం వలన అనుకుంట.. విడుదలైన 3, 4 రోజుల్లోనే అంటే వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను సాధించాయి. తర్వాత అవి బయ్యర్స్ కు భారీ లాభాలను కూడా అందించడం జరిగింది.

1) పెళ్ళి చూపులు :

విజయ్ దేవరకొండ- తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2016 లో విడుదలైంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పై సురేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేశారు. విడుదలైన 3 రోజులకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. రూ.1.57 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టి ఆ టార్గెట్ ను పూర్తి చేసింది.

2) అర్జున్ రెడ్డి :

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2017 లో విడుదలైంది. ఈ చిత్రం రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికే రూ.11 కోట్ల వరకు షేర్ ను నమోదు చేసి బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసింది.

3) ఆర్.ఎక్స్.100 :

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ చిత్రం 2018 లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం రూ. 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫస్ట్ వీకెండ్ కే ఆ టార్గెట్ ను పూర్తి చేసి హిట్ లిస్ట్ లో చేరిపోయింది.

4) గీత గోవిందం :

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2018లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం 3 రోజులకే రూ.20 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది.

5) టాక్సీ వాలా :

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి వీకెండ్ కే రూ.9 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ లిస్ట్ లో చేరింది.

6) మాస్టర్ :

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. రూ.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి రూ.10 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.

7) ఉప్పెన :

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ 2021 లోనే రిలీజ్ అయ్యింది. రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం వీకెండ్ ముగిసేసరికి రూ.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టి సూపర్ హిట్ సినిమాల లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

8) జాతి రత్నాలు :

నవీన్ పోలిశెట్టి, ఫారియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021 లోనే రిలీజ్ అయ్యింది. రూ.10.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం వీకెండ్ ముగిసే సరికి రూ.14 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసి సూపర్ హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

9) డిజె టిల్లు :

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.9 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం వీకెండ్ ముగిసేసరికే రూ.9.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

10) మేజర్ :

అడివి శేష్ హీరోగా శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం వీకెండ్ ముగిసేసరికే రూ.19 కోట్ల షేర్ ను సాధించి సూపర్ హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus