సంక్రాంతి బరిలో నిలిచిన చిరు సినిమాల కలెక్షన్స్!

  • January 16, 2023 / 05:44 PM IST

వాల్తేరు వీరయ్యతో మరో సంక్రాంతి కొట్టాడు మన మెగాస్టార్ చిరంజీవి. బాలయ్య బాబు వీర సింహ రెడ్డి సినిమాతో పాటు చిరు మూవీ కూడా మంచి కల్లెక్షన్స్ ని రాబడుతుంది. రిలీజ్ అయినా మూడు రోజుల్లో అమెరికా లో 1 మిలియన్ డాలర్ తో పాటు ఓవరాల్ గా 100 కోట్ల గ్రాస్ తో వీరయ్య సంక్రాంతి బాక్సఫీస్ వేట మొదలైంది. ఈ ఊపు చూస్తుంటే చిరంజీవి బాక్సఫీస్ దగ్గర మరో సంక్రాంతి హిట్ కంఫర్మ్ అయినట్టే.

అయితే వాల్తేరు వీరయ్యకి కంటే ముందు, చిరు సినిమాలు సంక్రాంతి కి రిలీజ్ అయినవి ఉన్నాయి. ఇందులో హిట్లర్, అన్నయ్య, ఖైదీ నెంబర్ 150 లాంటి హిట్స్ తో పాటు కొన్ని ప్లాప్స్ కూడా ఉన్నాయి.

1. చట్టంతో పోరాటం – 1985 – గ్రాస్ కలెక్షన్స్ : 2-3 కోట్ల

1985 లో మొదటి సరి సంక్రాంతి బరిలో దిగారు చిరు ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ మూవీ తో పాటు బాలకృష్ణ ఆత్మా బలం రిలీజ్ అయ్యింది కానీ అది ప్లాప్ అయ్యింది.

2. దొంగ మొగుడు – 1987 – గ్రాస్ కలెక్షన్స్: 4-5 కోట్ల

చిరంజీవి కి దొంగ మొగుడు రెండో సంక్రాంతి సినిమా, ఈ సినిమా బాలయ్య బాబు భార్గవ రాముడు తో రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది

3. మంచి దొంగ – 1988 – గ్రాస్ కలెక్షన్స్: 4-5 కోట్ల 

చిరంజీవి-సుహాసినిల కాంబినేషన్ లో వచ్చిన మంచి దొంగ సినిమా చిరుకి మూడో సంక్రాంతి హిట్.

4. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు – 1989 – గ్రాస్ కలెక్షన్స్: 5.25 కోట్ల

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు…ఇది చిరు కెరీర్లో ఒక మాస్ హిట్….సంక్రాంతి కి రిలీజ్ అయినా ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డు సెట్ చేసింది అప్పట్లో.

5. హిట్లర్ -1997 – గ్రాస్ కలెక్షన్స్: 6+ కోట్ల

బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఉన్న చిరు చాలా స్టోరీలు విని లాస్ట్ కి మలయాళంలో హిట్ అయినా హిట్లర్ సినిమా ని రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండస్ట్రీలో కొందరు అంత సెంటిమెంటల్ సినిమా ఆడాడు అని చెప్పారు కానీ చిరు లేదు హిట్ అవుతుంది అని నమ్మి చేసిన ఈ రీమేక్ బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ ని ఇచ్చింది.

6. స్నేహం కోసం – 1999 – గ్రాస్ కలెక్షన్స్ : 5+ కోట్ల (Estimated)

1999 సంక్రాంతి కి మెగాస్టార్ స్నేహం కోసం మూవీ తో పాటు బాలయ్య బాబు నరసింహ నాయుడు కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో నరసింహ నాయుడు ఆల్ టైం హిట్ అయితే స్నేహం కోసం సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది.

7. అన్నయ్య – 2000 – గ్రాస్ కలెక్షన్స్: 11+ కోట్ల 

చిరంజీవి & సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్రదర్స్-సిస్టర్స్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది.

8. మృగరాజు – 2001 – గ్రాస్ కలెక్షన్స్: 4-5 కోట్ల

గుణశేఖర్ డైరెక్షన్లో చూడాలని వుంది తరువాత చిరు చేసిన మృగరాజు సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

9. అంజి – 2004 – గ్రాస్ కలెక్షన్స్: 5+ కోట్ల

అప్పట్లోనే 25 కోట్ల బడ్జెట్ తో అయిదు సంవత్సరాల పాటు షూట్ చేసిన అంజి మూవీ సంక్రాంతి టైం కి రిలీజ్ చేస్తే ప్లాప్ అయ్యింది…కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అప్పుడు ఆడలేదు కానీ తరువాత కల్ట్ స్టేటస్ వచ్చింది…అంతే కాదు అంజి మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

10. ఖైదీ నెంబర్ 150 – 2017- వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్: 160+ కోట్ల

రాజకీయాల్లోకి వెళ్ళిపోయి దాదాపు పది సంవత్సరాల తరువాత సినిమా సైన్ చేసిన చిరు…. ఖైదీ నెంబర్ 150 సినిమా తో మంచి రే ఎంట్రీ ఇచ్చారు… ఇవ్వడమే కాదు నూట యాభై కోట్ల కలెక్షన్స్ తో బాక్సఫీస్ బాస్ అని ప్రూవ్ చేసారు.

11. వాల్తేరు వీరయ్య- 2023- గ్రాస్ కలెక్షన్స్ *** Rs 100+ కోట్ల

ఖైదీ నెంబర్ 150 తరువాత మల్లి సంక్రాంతి బరిలో దిగారు చిరు అది కూడా బాలయ్య వీర్ సింహ రెడ్డి తో. ఈ సరి ఇద్దరు హిట్ కొట్టారు…వీరయ్య వంద కోట్ల కలెక్షన్స్ తో ఊపు మీద ఉన్నాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus