ఓవర్సీస్ ప్రీమియర్స్ విషయంలో.. అల్లు అర్జున్ టాప్ 10 మూవీస్ ఇవే.!

తెలుగు సినిమా స్థాయి ఏంటనేది ప్రపంచమంతా తెలుసుకుంది. బాహుబలితోనే కాదు గతంలో వచ్చిన ‘దూకుడు’ ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలు ఓవర్సీస్ లో మిలియన్ల కొద్దీ డాలర్లకి వసూల్ చేసాయి. అక్కడ మహేష్ బాబు… పవన్ కళ్యాణ్ సినిమాలకి భీభత్సమైన క్రేజ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మిగిలిన హీరోల సినిమాలకి కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదవుతున్నాయి. మొన్నటికి మొన్న ‘అఖండ’ చిత్రం 1 మిలియన్ కొట్టింది. అయితే తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం కేవలం ప్రీమియర్స్ తోనే $500K(హాఫ్ మిలియన్) కొట్టడం విశేషం.

సుకుమార్ సినిమాలకి కూడా అక్కడ మంచి క్రేజ్ ఉంది. ‘రంగస్థలం’ చిత్రం అక్కడ ఫుల్ రన్లో $3.5 మిలియన్ కొట్టింది. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం కూడా $3.6 మిలియన్ డాలర్లని వసూల్ చేసి చరిత్ర సృష్టించింది. నాన్- బాహుబలి కేటగిరిలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాలు ఇవే. ఫుల్ రన్లో ‘పుష్ప’ మరింతగా కలెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) అల వైకుంఠపురములో :

త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేసిన మూడవ సినిమా ఇది. ఈ చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే $816K డాలర్లని వసూల్ చేసింది.

2) పుష్ప ది రైజ్ :

అల్లు అర్జున్- సుకుమార్ ల కలయికలో మూడవ చిత్రంగా వచ్చిన ‘పుష్ప’ కూడా ప్రీమియర్స్ తోనే $530K డాలర్లని వసూల్ చేసింది.

3)సన్ ఆఫ్ సత్యమూర్తి :

త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేసిన రెండవ సినిమా ఇది. ఈ చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే $347K డాలర్లని వసూల్ చేసింది.

4)దువ్వాడ జగన్నాథం(డిజె) :

అల్లు అర్జున్- హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్స్ తోనే $305K డాలర్లని వసూల్ చేసింది.

5) నా పేరు సూర్య :

అల్లు అర్జున్- వక్కంతం వంశీ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్స్ తోనే $207K డాలర్లని వసూల్ చేసింది.

6) సరైనోడు :

అల్లు అర్జున్- బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్స్ తోనే $197K డాలర్లని వసూల్ చేసింది.

7) రేసుగుర్రం :

అల్లు అర్జున్- సురేంద్ర రెడ్డి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్స్ తోనే $102K డాలర్లని వసూల్ చేసింది.

8)జులాయి :

త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేసిన మొదటి సినిమా ఇది. ఈ చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే $87K డాలర్లని వసూల్ చేసింది.

9) ఇద్దరమ్మాయిలతో :

అల్లు అర్జున్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే $80K డాలర్లని వసూల్ చేసింది.

10) బద్రీనాథ్ :

అల్లు అర్జున్ వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ ప్రీమియర్స్ తోనే $57K డాలర్లని వసూల్ చేసింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus