గతేడాది తల్లిదండ్రులైన సినిమా సెలబ్రిటీలు వీళ్ళే..!

అమ్మా నాన్నలు అవ్వడం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్పవరం. ఓ రకంగా ప్రపంచాన్నే గెలిచేసాము అనేంత ఆనందాన్ని కలిగిస్తుంది ఈ వార్త. అది ఒక ప్రమోషన్ లా కూడా భావిస్తుంటారు అనడంలో అతిశయోక్తి కాదు. కేవలం సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఈ వార్త వినగానే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు.వారి అభిమానులు కూడా అదే విధంగా స్పందించి.. శుభాకాంక్షలు తెలుపుతుంటారు. 2020 వ సంవత్సరంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు తల్లిదండ్రులు అయిన విషయాలను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు తెలియాజేశారు. ఆ లిస్ట్ లో ఉన్న సెలబ్రిటీలు ఎవరెవరు.. ఓ లుక్కేద్దాం రండి :

1) కార్తీ :

2020లో కార్తీ రెండోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రంజనీ… పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ విషయాన్ని కార్తీనే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.

2) అనుష్క శర్మ :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా తల్లి కాబోతున్న విషయాన్ని ఆమె భర్త మరియు స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. మూడేళ్ళ క్రితం వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

3) సైఫ్ అలీ ఖాన్ :

బాలీవుడ్ స్టార్ కపుల్ అయిన సైఫ్ మరియు కరీనా కపూర్ లు కూడా రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్టు తెలిపి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

4) అనిత :

‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత కూడా తల్లి కాబోతున్నట్టు గతేడాది అభిమానులకు తెలిపింది. 2013లో ఈమె రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు హిందీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

5)స్నేహ :

తెలుగింటి అమ్మాయి స్నేహ కూడా గతేడాది పండంటి పాపకు జన్మనిచ్చినట్టు.. ఆమె భర్త ప్రసన్న సోషల్ మీడియాలో తెలిపాడు.

6) సంఘవి :

ఒకప్పటి హీరోయిన్ సంఘవి కూడా ఓ పాపకు జన్మనిచ్చింది. నాలుగేళ్ల క్రితం ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ను పెళ్లి చేసుకున్న సంఘవి.. 42ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోవడం విశేషం.

7) సయాలి భగత్ :

‘బ్లేడ్ బాబ్జి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా సయాలి కూడా 2020లోనే తల్లయ్యింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ఈ బ్యూటీ. 2013లో ఈమె ప్రముఖ బిజినెస్మెన్ అయిన నవీన్ ప్రతాప్ సింగ్ ను పెళ్లి చేసుకుంది.

8) శిల్పా శెట్టి :

‘సాహస వీరుడు సాగర కన్య’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శిల్పా శెట్టి.. గతేడాది ఓ పాపకు జన్మనిచ్చింది. 2009 ఈమె ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

9) నటాషా స్టాంకోవిక్ :

హార్దిక్ పాండ్యా ను పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసింది నటాషా. ఈ జంట కూడా 2020 లో తల్లిదండ్రులు అవ్వడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

10) అమృతా రావు :

మహేష్ బాబు ‘అతిథి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమృతా.. కూడా 2020 లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రముఖ రేడియో జాకీ అయిన ఆర్జేను ఈమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

11) మందిరా బేడీ :

‘సాహో’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మందిరా బేడీ.. రాజ్ కౌశల్ అనే వ్యక్తిని 1999లో పెళ్లి చేసుకుంది. 2011లో వీర్ అనే మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది ఈ బ్యూటీ. 2020 లో ఈమె ఓ పాపను దత్తత తీసుకుని మరోసారి తల్లయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus