గత 3 ఏళ్ళలో విడాకులు తీసుకున్న స్టార్ కపుల్స్ ఎవరో తెలుసా?

ప్రేమ, డేటింగ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు వంటి వ్యవహారాలు అన్నీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. ఇది వరకు సెలబ్రిటీల విషయంలోనే ఎక్కువగా ఇలాంటివి వినేవాళ్ళం. కానీ ఇప్పుడు సామాన్యులు సైతం వీటికి మినహాయింపు కాదు అని ప్రూవ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సెలబ్రిటీల విడాకుల వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తున్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్ళ విడాకుల వ్యవహారాలు నిత్యం చర్చకు దారి తీస్తుంటాయి. ఇక ఇటీవల ఓ సర్వే ప్రకారం.. గత 3 ఏళ్లలో విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీ కపుల్స్ ఎక్కువగానే ఉన్నారట. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

Celebrity Couples

1) ఆమిర్ ఖాన్ – కిరణ్ రావ్ :

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) తన రెండో భార్య కిరణ్ రావుతో (Kiran Rao) 15 ఏళ్ళు కాపురం చేసి.. విడాకులు తీసుకోవడం జరిగింది. కోవిడ్ టైంలో వీళ్ళు విడాకులు ప్రకటించడం జరిగింది.

2) నాగ చైతన్య – సమంత :

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) , హీరోయిన్ సమంత (Samantha) ఇద్దరూ కూడా మనస్పర్థల కారణంగా 2021 లో విడాకులు తీసుకున్నారు. 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 4 ఏళ్ళ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది.

3) ధనుష్ – ఐశ్వర్య :

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తన భార్య ఐశ్వర్యతో (Aishwarya Rajinikanth) మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పెళ్ళైన 18 ఏళ్ళ తర్వాత వీళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది.

4) సానియా మీర్జా – షోయబ్ మాలిక్ :

2006 లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్ – సానియా మీర్జా.. దంపతులు (Celebrity Couples)  17 ఏళ్ళు కాపురం చేసి ఈ ఏడాది విడాకులు ప్రకటించారు. తర్వాత షోయబ్ మాలిక్ ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

5) నిహారిక – చైతన్య :

మెగా డాటర్ నిహారిక (Niharika) … చైతన్య జొన్నలగడ్డని 2020 లో పెళ్లి చేసుకుంది. 2023 లో ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది.

6) హార్దిక్ – నటాషా :

ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా… ప్రముఖ బాలీవుడ్ నటి నటాషాని 2020 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే తర్వాత వీరి మధ్య మనస్పర్థలు సంభవించడంతో ఈ ఏడాది విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. వీరికి అగస్త్య అనే బిడ్డ కూడా ఉంది. అయినా విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయారు.

7) నవాజుద్దీన్ సిద్ధిఖీ – అంజనా :

బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) తన భార్య అంజనా కిషోర్ పాండేతో గత ఏడాది అంటే 2023 లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. 2009 లో వీరి వివాహం జరిగింది.

8) హానీ సింగ్ – షాలినీ :

బాలీవుడ్ సింగర్, యాక్టర్ అయినటువంటి యో యో సన్నీ సింగ్ తన భార్య షాలిని తల్వార్ కి విడాకులు ఇవ్వడం జరిగింది. 2011 లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట (Celebrity Couples)  2022 లో విడిపోయారు.

9) సోహైల్ ఖాన్ – సీమా సచ్దేవ్ :

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయినటువంటి సోహైల్ ఖాన్ కూడా తన భార్య సీమా సచ్దేవ్ కి విడాకులు ఇచ్చాడు. 1998 లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2022 లో విడిపోయారు.

10) జీవీ ప్రకాష్ – సైంధవి :

తెలుగు, తమిళ భాషల్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన జీవీ ప్రకాష్ (GV Prakash).. మరోపక్క హీరోగా కూడా వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రకాష్ కూడా తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్నారు. 2013 లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట (Celebrity Couples)  2024 లో విడిపోయారు.

11) జయం రవి – ఆర్తి :

తమిళ స్టార్ హీరో ‘జయం’ రవి (Jayam Ravi) కూడా తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. 2009 లో వివాహం చేసుకున్న ఈ జంట 2024 లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

10 ఏళ్ళ డిజాస్టర్ ‘ఆగడు’ గురించి ఎవ్వరికీ తెలియని 10 విషయాలు..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus