Aagadu: 10 ఏళ్ళ డిజాస్టర్ ‘ఆగడు’ గురించి ఎవ్వరికీ తెలియని 10 విషయాలు..!

‘దూకుడు’ (Dookudu) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. మహేష్ (Mahesh Babu) – శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో ‘ఆగడు’ (Aagadu) అనే సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయి.? పైగా ‘దూకుడు’ ని అందించిన ’14 రీల్స్’ సంస్థే ‘ఆగడు’ ని నిర్మించడం, ‘దూకుడు’ కి మర్చిపోలేని సంగీతం అందించిన తమన్ (S.S.Thaman) … ‘ఆగడు’ కి సంగీత దర్శకుడు కావడంతో హైప్ పెరగడానికి కారణాలు అయ్యాయి. కానీ ఆ అంచనాలు ‘ఆగడు’ అందుకోలేదు. కానీ ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ విశేషాలు తెలుసుకుందాం రండి :

Aagadu

1) ‘దూకుడు’ టైంలోనే దర్శకుడు శ్రీను వైట్ల.. ‘ఆగడు’ టైటిల్ ను రిజిస్టర్ చేయించి పెట్టారు. ఆ టైటిల్ పెట్టి మహేష్..తోనే ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ టైంకి అతని దగ్గర కథ లేదు.

2) ‘దూకుడు’ ‘బిజినెస్ మెన్’ (Businessman) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత.. మహేష్ చేసిన ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) డిజాస్టర్ అయ్యింది. ‘1 నేనొక్కడినే’ సినిమాని ఇప్పుడు కల్ట్ అంటున్నారు. కానీ ఆ సినిమా విడుదల టైంలో మహేష్ అభిమానులే తిట్టిపోశారు. అందుకే అర్జెంట్ గా వాళ్ళని సంతృప్తి పరిచే ఎలిమెంట్స్ తో ఓ సినిమా చేయాలనుకున్నాడు మహేష్.

3) ఈ క్రమంలో తన టీంతో ఓ మాస్ కథ కోసం గాలించడం మొదలుపెట్టాడు మహేష్ బాబు. ఆ టైంలో తన టీం సలహాతో శ్రీను వైట్లని అప్రోచ్ అయ్యారు. అప్పటికి శ్రీను వైట్ల వద్ద ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన కథ మాత్రమే ఉంది. సరే అని ‘ఆగడు’ (Aagadu) టైటిల్ తో ప్రాజెక్టు అనౌన్స్ చేశారు.

4) స్క్రిప్ట్ పూర్తిగా లేకుండానే… ‘భేల్ పూరి’ సాంగ్ షూటింగ్ మొదలుపెట్టారు. విదేశాల్లో ఎక్కడో ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా లేని ప్లేస్ వెళ్లి ఈ పాటను షూట్ చేశారు.

5) ‘భేల్ పూరి’ సాంగ్ అనంతరం మహేష్ బాగా సిక్ అయ్యారు. వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో.. షూటింగ్ కి కొంత బ్రేక్ ఇచ్చారు.

6) శ్రీను వైట్ల ఆస్థాన రైటర్స్ అయినటువంటి కోన వెంకట్ (Kona Venkat) , గోపి మోహన్ (Gopimohan) ..లు లేకుండా శ్రీను వైట్ల చేసిన మొదటి సినిమా ఇది.

7) ఈ సినిమా ఫస్ట్ హాఫ్..కి అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్క్రీన్ ప్లే అందించారు. అయితే సెకండాఫ్ విషయంలో పటాస్ (Pataas) టచ్ ఉండేలా డిజైన్ చేసుకున్నాడట అనిల్. అదే టైంలో అతనికి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నుండి డైరెక్షన్ ఛాన్స్ రావడంతో అతను ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. అతను పనిచేసి ఉంటే సెకండాఫ్ ఇంకోలా ఉండేదేమో. రైటర్స్ సపోర్ట్ లేకుండా శ్రీను వైట్ల సెకండాఫ్ డిజైన్ చేశారు.

8) సినిమాలో విలన్ గా మొదట ప్రకాష్ రాజ్ (Prakash Raj)ఎంపికయ్యాడు. అతనితో చాలా వరకు షూటింగ్ చేశారు. కానీ శ్రీను వైట్లతో మనస్పర్థలు రావడంతో ప్రకాష్ రాజ్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వకుండానే ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత అతను మీడియా సమావేశం ఏర్పాటు చేసి శ్రీను వైట్ల గురించి రకరకాల కామెంట్లు చేసి కాంట్రోవర్సీ తెరలేపాడు. ఈ క్రమంలో ‘నన్ను రాళ్లతో కొట్టకు.. ఇల్లు కట్టేసుకుంటాను’ ‘విషం పెట్టకు మింగి నీలకంఠుడుని అయిపోతాను’ అంటూ డైలాగులు చెప్పాడు ప్రకాష్ రాజ్. ఆ డైలాగులను శ్రీను వైట్ల సినిమాలో సోనూసూద్ తో (Sonu Sood) చెప్పించి తర్వాత హీరోతో వాటిపై పంచ్..లు వేయించాడు.

9) ఇక ప్రకాష్ రాజ్ తప్పుకోవడంతో సోనూ సూద్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. ఓ పక్క అతను ముంబైలో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సినిమా షూటింగ్ చేస్తూనే, మరోపక్క హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి వచ్చి ఇక్కడ ‘ఆగడు’ షూటింగ్లో పాల్గొన్నాడు.

10) ఇక ‘ఆగడు’ లో శ్రీహరి (Srihari) కోసం ఓ పవర్ఫుల్ పోలీస్ రోల్ డిజైన్ చేశారు. కానీ ఆయన మరణించడంతో మార్పులు చేసి.. రావు రమేష్ తో (Rao Ramesh) ఆ పాత్ర చేయించడం జరిగింది.

11) ఏదేమైనా కానీ.. శ్రీను వైట్ల 8 నెలల్లోనే సినిమాని కంప్లీట్ చేసి… 2014 సెప్టెంబర్ 19న విడుదల చేశారు. మొదటి షోతోనే సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓవర్సీస్లో ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ కొట్టిన మొదటి సినిమాగా ‘ఆగడు’ సరికొత్త రికార్డులు సృష్టించింది.

అంతేకాదు డిజాస్టర్ టాక్ తో కూడా అక్కడ 1 మిలియన్ కొట్టడం అప్పుడో రికార్డుగా చెప్పుకోవాలి.

ఫుల్ రన్లో ‘ఆగడు’ రూ.65 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus