హీరోయిన్లు అభినయ, సాక్షి అగర్వాల్ కూడా ఈ ఏడాదే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
వీళ్లతో పాటు నర్గీస్ ఫక్రీ, హీనా ఖాన్, సింగర్ ఆర్యన్ మాలిక్ వంటి వారు కూడా పెళ్లి చేసుకున్న వారి జాబితాలోకి చేరారు.
పేరెంట్స్‌గా ప్రమోట్ అయిన సెలబ్రిటీలు
పెళ్లిళ్లు మాత్రమే కాదు, ఈ ఏడాది చాలా మంది స్టార్ కపుల్స్ పేరెంట్స్‌గా కూడా ప్రమోట్ అయ్యారు.
కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా జంట ఆడబిడ్డకు వెల్కమ్ చెప్పారు.
కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ జంట మగబిడ్డకు తల్లిదండ్రులయ్యారు.
టాలీవుడ్ జంట వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కూడా ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు.
పరిణీతి చోప్రా, అతియా శెట్టి, యామీ గౌతమ్ వంటి హీరోయిన్లు కూడా ఈ ఏడాది మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇలియానా తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది.
ఊహించని .. షాకింగ్ బ్రేకప్స్
శుభవార్తలు మాత్రమే కాదు, ఇంకోవైపు కొన్ని జంటలు ఊహించని షాకులు ఇచ్చాయి.
తమన్నా – విజయ్ వర్మ బ్రేకప్ స్టోరీ అందరికీ షాకిచ్చింది.
హీరోయిన్ నివేదా పేతురాజ్ ఎంగేజ్మెంట్ కూడా రద్దు అయ్యింది
క్రికెటర్ స్మృతి మంధాన – పలాష్ ముచ్చల్ పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. వాళ్ళు విడిపోవడం ఇండియా మొత్తానికి షాకిచ్చింది అని చెప్పాలి.
క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ జంట అధికారికంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
మలయాళ నటి మీరా వాసుదేవన్, జెన్నిఫర్ లోపెజ్, నికోల్ కిడ్మాన్ వంటి స్టార్స్ కూడా తమ వైవాహిక బంధాలకు ముగింపు పలికారు.
జయం రవి, ఆర్తి దంపతుల విడాకుల వ్యవహారం అయితే పెద్ద ఎత్తున దుమారం రేపింది.
ఫైనల్లీ త్వరలో పెళ్లికి రెడీ అవుతున్న లవ్ బర్డ్స్
ఈ బ్రేకప్స్ వంటి విషయాలు పక్కన పెడితే, మరికొందరు సెలబ్రిటీలు త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నారు.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రష్మిక మందన్న – విజయ్ దేవరకొండల ఎంగేజ్మెంట్ జరిగిపోయింది.
మెగా హీరో అల్లు శిరీష్ కూడా తన ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అయిపోయాడు.
తమిళ హీరో విశాల్ కూడా హీరోయిన్ సాయి ధన్సికని త్వరలో పెళ్ళిచేసుకోబోతున్నాడు.
కొంతకాలంగా సహజీవనం చేస్తున్న అర్జున్ రాంపాల్ వంటి వారు కూడా పెళ్లి బంధంతో ఒక్కటవ్వడానికి రెడీ అయ్యారు.