అక్కడ హిట్… ఇక్కడ ఫ్లాప్ … ఈ ఏడాది ప్లాప్ అందుకున్న రీమేక్ సినిమాలు!

సాధారణంగా ఒక భాషలో ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్న సినిమాలను తిరిగి ఇతర భాషలలో రీమేక్ చేయడం సర్వసాధారణం. అయితే అక్కడ హిట్ అయిన సినిమాలు ఇక్కడ కూడా హిట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇతర దేశాలలో హిట్ అందుకున్న సినిమాలు ఇక్కడ మాత్రం ఫ్లాప్ అందుకున్నాయి. మరి ఈ ఏడాది ఫ్లాప్ అయిన ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేసేద్దాం… అరడజనుకు పైగా ఆస్కార్ అవార్డులను అందుకున్న హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా హిందీలో లాల్ సింగ్ చద్దా పేరుతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమా మొదటి షో నుంచి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక నటి తాప్సీ లూప్ ల పేట, దోబేరా, బ్లర్ సినిమాలలో నటించారు. ఈ మూడు సినిమాలు కూడా విదేశీ రీమేక్ సినిమాలే.లూప్ ల పేట, సినిమాని జపాన్ హిట్ ఫిలిం అయినటువంటి రన్ లోలా రన్ అనే సినిమాకు రీమేక్ చిత్రంగా తెరకేక్కించారు.

ఇక స్పానిష్ సినిమా సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మిరాజ్ ఆధారంగా దోబెరా సినిమాని తెరకెక్కించారు. అదేవిధంగా స్పానిష్ హర్రర్ థ్రిల్లర్ లాస్ ఓ జోస్ దే జూలియా ఆధారంగా బ్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ మూడు సినిమాలు కూడా తీవ్ర నిరాశపరిచాయి .అయితే ఈ మూడు సినిమాలు ఒరిజినల్ భాషలో అద్భుతమైన హిట్ అందుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలైనటువంటి శాకినీ డాకినీ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.

నివేద థామస్ రెజినా నటించిన ఈ సినిమా సౌత్ కొరియన్ హిట్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ కు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సౌత్ కొరియాలో ఈ సినిమా మంచి హిట్ అందుకోగా తెలుగులో తీవ్ర నిరాశపరిచింది.ఇలా ఈ ఏడాది విదేశాలలో మంచి హిట్ అందుకున్న ఈ సినిమాలన్నీ ఇక్కడ మాత్రం తీవ్ర నిరాశను ఎదుర్కొన్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus