ఇప్పటి వరకు ఆస్కార్ సాధించిన ఇండియన్ సినిమాలు ఇవే..!

  • March 13, 2023 / 02:58 PM IST

భారీ ఉత్కంఠత, ఆకాశాన్నంటే అంచనాలతో అంగరంగవైైభవంగా 95వ ఆస్కార్ (2023) వేడుకలు జరిగాయి.. ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఇండియన్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. ఈ సంవత్సరం మన దేశం నుంచి ‘ఆల్ దట్ బ్రీత్స్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ‘నాటు నాటు’ అవార్డులు గెలుచుకున్నాయి.. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఆస్కార్ అందుకున్న భారతీయులు, ఆ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం..

1) భాను అథైయా – గాంధీ (1983)..

1983లో మొదటిసారి ఇండియాకి ఆస్కార్ వచ్చింది.. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకి గానూ ‘బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్’గా భాను అథైయా ఆస్కార్ గెలుపొందారు. ఈ సినిమాకి ఆమెతో పాటు ఇంగ్లాండ్ కి చెందిన జాన్ మొల్లో కూడా పని చేసి.. ఆస్కార్ అందుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కింది ‘గాంధీ’ సినిమా.. (గాంధీ మూవీకి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో సితారిస్ట్ రవి శంకర్ నామినేట్ అయ్యారు)..

2) సత్యజిత్ రే – (1992)..

ఇండియన్ సినీ చరిత్రలో శాశ్వతంగా తమ పేరు నిలిచిపోయేలా చేసుకున్న లెజెండరీ ఫిలిం మేకర్స్‌లో సత్యజిత్ రే ఒకరు. కెరీర్‌లో దాదాపు 36 సినిమాలను తెరకెక్కించి.. సినీ రంగానికి విశేష సేవలందించినందుకు.. 1992లో ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ సత్యజిత్ రేని హానరరీ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారాయన.. ఆస్కార్ వరించిన అదే ఏడాది అనారోగ్యం కారణంగా కన్నుమూశారు..

3) గుల్జార్ – (2009)..

‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రముఖ లిరిసిస్ట్ గుల్జార్ ఆస్కార్ అందుకున్నారు. ‘జయహో’ సాంగ్ లిరిక్స్‌కి గాను ఆయన ఆస్కార్ గెలిచారు. గుల్జార్ గురించి, వారి పాటల గురించి భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా, రచయితగా, లిరిసిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ చాటుకున్నారు గుల్జార్..

4) ఏఆర్ రెహమాన్ – (2009)..

ఇప్పటివరకు ఇండియా నుండి ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఏకైక వ్యక్తి రెహమాన్.. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకి గాను ఒరిజినల్ సాంగ్ (జయహో), ఒరిజినల్ స్కోర్ కేటగిరీలలో రెహమాన్ రెండు ఆస్కార్‌లు అందుకుని చరిత్ర సృష్టించారు.. ఆ తర్వాత 2011లో ‘127 అవర్స్’ మూవీకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్కోర్ కేటగిరిలలో నామినేట్ అయ్యారాయన..

5) రసూల్ పూకుట్టి – (2009)..

‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకి గాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ గెలుపొందారు. ఆ సినిమాకి రిచర్డ్ ఫ్రెక్, ఇయాన్ ట్యాప్ లతో కలిసి రసూల్ ఈ అవార్డు అందుకున్నారు. కాగా.. రసూల్ పూకుట్టి..

6) గునీత్ మోంగా – (2019)..

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నిర్మాత గునీత్ మోంగా ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’ (Period. End of Sentence) కి ఆస్కార్ అందుకున్నారు..

7) కీరవాణి – (2023)..

95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాటకు గానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణిని ఆస్కార్ వరించింది.. గీత రచయిత చంద్రబోస్ కూడా ఆయనతో కలిసి అకాడమీ అవార్డ్ అందుకున్నారు..

8) కార్తికి గొన్సాల్వేస్ – గునీత్ మోంగా – (2023)..

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కి అకాడమీ అవార్డ్ గెలుచుకున్నారు గునీత్ మోంగా.. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన లేడీ డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్ కూడా అవార్డ్ అందుకున్నారు.. ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్’ (Period. End of Sentence) తర్వాత గునీత్ సాధించిన రెండో ఆస్కార్ ఇది.. ఏఆర్ రెహమాన్ తర్వాత రెండు ఆస్కార్స్ (రెండు సార్లు) గెలుచుకుంది ఈమే కావడం విశేషం..

9) చంద్రబోస్

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus