రవితేజ మిస్ చేసుకున్న 10 సినిమాల్లో 7 సూపర్ హిట్లే..!

మాస్ మహారాజ్ రవితేజ ఓ లైట్ మెన్ గా కెరీర్ ను మొదలుపెట్టి… తన కష్టంతో ఈరోజున పెద్ద స్టార్ గా ఎదిగాడు. అతని 30ఏళ్ళ కెరీర్లో హీరోగా నిలదొక్కుకోవడానికి 12ఏళ్ళు టైం పట్టింది. కెరీర్ ప్రారంభంలో లైట్ మెన్ గా, అటు తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా, అటు తరువాత పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చేవాడు రవితేజ. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఇడియట్’ చిత్రాలు రవితేజకు లైఫ్ ఇచ్చిన సినిమాలు.ఇవి పూరి తెరకెక్కించినవే..! అయితే రవితేజ ను నటుడుగా నిలబెట్టింది మాత్రం దర్శకుడు కృష్ణవంశీ అనే చెప్పాలి. ‘సింధూరం’ ‘ఖడ్గం’ వంటి చిత్రాల్లో రవితేజతో అద్భుతమైన నటన చేయించాడు కృష్ణవంశీ. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. రవితేజ అనుకోకుండా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసాడు. వాటిలో సూపర్ హిట్లు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆనందం :

మొదట ఈ కథను రవితేజకు వినిపించాడు శ్రీనువైట్ల. కానీ ‘ఇట్లు శ్రావణి సుబ్రహమణ్యం’ సినిమాతో బిజీగా ఉండడంతో దీనిని రిజెక్ట్ చేసాడట.

2) ఆర్య :

ఈ చిత్రాన్ని ప్రభాస్, ఎన్టీఆర్, అల్లరి నరేష్ లతో పాటు రవితేజ కూడా రిజెక్ట్ చేసాడట. ఆ తరువాత బన్నీ వద్దకు వెళ్లిందని తెలుస్తుంది.

3) పోకిరి :

‘ఉత్తమ్ సింగ్’ పేరుతో పూరి ఈ చిత్రాన్ని రవితేజతో చేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడు వరుస ప్రాజెక్టులతో రవితేజ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పవన్ వద్దకు వెళ్ళింది. కానీ చివరికి మహేష్ చేసాడు.

4) గోదావరి :

శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రవితేజ చెయ్యాలి అనుకున్నాడు. కానీ రవితేజ బిజీగా ఉండడంతో తరువాత సుమంత్ తో చెయ్యాల్సి వచ్చింది.

5) కందిరీగ :

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ కథను ముందు రవితేజకు చెప్పాడు. కానీ రవితేజ హోల్డ్ లో పెట్టడంతో రామ్ తో చేసి హిట్టు కొట్టాడు సంతోష్.

6) గబ్బర్ సింగ్ :

ఈ చిత్రం మొదట రవితేజతో చెయ్యాలి అనుకున్నాడు హరీష్. కానీ పవన్ కళ్యాణ్ ‘దబాంగ్’ రీమేక్ రైట్స్ కొనుగోలు చెయ్యడంతో అతని వద్దకు వెళ్ళింది.

7) జై లవ కుశ :

మనం రవితేజ ట్రిపుల్ యాక్షన్ ను మిస్ అయ్యాము. ఈ మూవీ కథను మొదట అతనికే వినిపించాడు బాబీ.

8) బాడీగార్డ్ :

గోపీచంద్ మలినేని మొదట ఈ కథను రవితేజతో చెయ్యాలి అనుకున్నాడు. కానీ చివరికి వెంకటేష్ తో చేశారు.

9) ఎం.సి.ఎ :

వేణు శ్రీరామ్ మొదట ఈ చిత్రం కథను రవితేజకు చెప్పాడు. పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కానీ ఎక్కడ తేడా వచ్చిందో చివరికి నానితో ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేశారు.

10) మహా సముద్రం :

ఈ ప్రాజెక్టు కూడా రవితేజ రిజెక్ట్ చేసిందే. ఇప్పుడు శర్వానంద్ చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus