భారతీయ ప్రభుత్వం సినీ కళాకారులకు అందించే అత్యుత్తమ అవార్డులను ఈరోజు (శుక్రవారం) ప్రకటించారు. 65వ జాతీయ అవార్డులను ఢిల్లీ లో బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ వెల్లడించారు. 2017లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ఎంపికచేశారు. ఉత్తమ హీరోగా బెంగాలి నటుడు రిద్దీ సేన్(నాగర్‌కీర్తన్).. ఉత్తమ నటిగా శ్రీదేవి(మామ్) ఎంపిక అయ్యారు. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ నేషనల్ అవార్డును అందుకోగా.. బాహుబలి-2 మూడు విభాగాల్లో అవార్డులు అందుకుంది. విజేతలకు మే 3 న అవార్డులు ప్రదానం చేస్తారు.
ఉత్తమ చిత్రం : విలేజ్ రాక్‌స్టార్స్
ఉత్తమ నటుడు : రిద్దీ సేన్(నాగర్‌కీర్తన్)
ఉత్తమ నటి : శ్రీదేవి (మామ్)
ఉత్తమ దర్శకుడు : జయరాజ్(భయానకమ్)
ఉత్తమ సహాయ నటుడు: ఫహాద్ ఫాసిల్ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
ఉత్తమ సహాయ నటి : దివ్యా దత్(ఇరాదా)
ఉత్తమ తెలుగు చిత్రం: ఘాజీ
ఉత్తమ హిందీ చిత్రం: న్యూటన్
ఉత్తమ మలయాళీ చిత్రం: టేకాఫ్
ఉత్తమ తమిళ చిత్రం: టు లెట్
ఉత్తమ మరాఠీ చిత్రం: కచ్చా నింబూ
ఉత్తమ కన్నడ చిత్రం: హెబ్బెట్టు రామక్క
ఉత్తమ బెంగాలీ చిత్రం: మయురాక్షి
ఉత్తమ యాక్షన్ చిత్రం: బాహుబలి-2
ఉత్తమ సంగీత దర్శకుడు: ఏ.ఆర్ రెహమాన్ (మామ్), (కాట్రు వెలియిదాయ్)
ఉత్తమ నేపథ్య సంగీతం : ఏఆర్ రెహమాన్(మామ్)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథా)
ఉత్తమ స్పెషల్ ఎపెక్ట్స్: బాహుబలి-2
ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అబ్బాస్ అలీ మొఘుల్(బాహుబలి-2)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నాగర్‌కీర్తన్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: సంతోష్ రామన్(టేకాఫ్-మలయాళం)
బెస్ట్ సౌండ్ డిజైన్: వాకింగ్ విత్ విండ్(లడఖీ)
బెస్ట్ ఆడియోగ్రఫీ : విలేజ్ రాక్‌స్టార్స్ (మల్లికా దాస్ )
బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్‌ప్లే : సాజీవ్, తొండిముతులమ్ ద్రిసాక్షియుం(మలయాళం)
బెస్ట్ అడాప్డెట్ స్క్రీన్ ప్లే: జయరాజ్, భయానకమ్( జపనీయులు సినిమా నుంచి తీసుకున్నారు)
ఉత్తమ ఛాయాగ్రహణం: భయానకమ్(మలయాళం)
ఉత్తమ గాయని: శాషా త్రిపాఠి(వాన్ వెరివాన్- కాట్రు వెలియిదై)
ఉత్తమ గాయకుడు: కెజే.యేసుదాసు(పొయ్ మరంజ కాలమ్)
ఉత్తమబాల నటుడు : భానితా దాస్(విలేజ్ రాక్‌స్టార్ట్స్)
వీరితో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును వినోద్ ఖన్నాకు, నర్గీస్ దత్ అవార్డును దప్పా(మరాఠీ) కు అందిస్తున్నట్లు ప్రకటించారు.
For More Click Here -> 65th-national-film-awards-for-2017_