Bigg Boss 7 Telugu: ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పదా? నామినేషన్స్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఒక్కొక్కరు ఇద్దరిని బుసలు కొట్టే డ్రాగన్ స్నేక్ బొమ్మ దగ్గర నిలబెట్టి మరీ నామినేట్ చేయాలి. ఆ పాము నోట్లోంచి వచ్చిన కలర్ హౌస్ మేట్స్ కి పడుతుంది. ఈవారం నామినేషన్స్ ఒక రేంజ్ లో జరిగినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈసారి కూాడ 8మంది నామినేట్ అయ్యారు. వీళ్లలో 5గురు అబ్బాయిలు, 3గురు అమ్మాయిలు ఉన్నారు. ఈ నామినేషన్స్ లో అశ్విని కి ఇంకా యావర్ కి పెద్ద గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.

అలాగే, ఈసారి కూడా పల్లవి ప్రశాంత్ అమర్ నే టార్గెట్ చేశాడు. అమర్ కి ఎక్కువ ఓట్లు వచ్చినట్లుగా చెప్తున్నారు. ప్రశాంత్ చెప్పిన పాయింట్ కి అమర్ ఇరిటేట్ అయ్యాడు. వేరే వాళ్ల పాయింట్స్ తెచ్చి నన్ను నామినేట్ చేయడం ఎంతవరకూ కరెక్ట్ అంటూ వాదించారు. అంతేకాదు, ఈవారం అమర్ కి – భోళెకి పెద్ద మాటల యుద్దం జరిగిందని టాక్. అలాగే రతిక ఇంకా ప్రియాంక మద్యలో మాటలు తూటాల్లా పేలాయి. నామినేషన్ అయిన వెంటనే డోర్ ఓపెన్ చేసి వెళ్లమ్మా అని ఎవరూ చెప్పడం లేదని ప్రియాంక రతికని లాక్ చేసింది.

ఇద్దరూ చాలాసేపు ఆర్గ్యూ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రియాంక బోలేని కెప్టెన్సీ టాస్క్ నుంచీ తప్పించాడని నామినేట్ చేసింది. దీనికి నేను ఓటు వేయలేదు, పోటు పొడిచా – ఓటుకి – పోటుకి తేడా తెలుసుకో అంటూ రెచ్చగొట్టాడు. దీనికి ప్రియాంక అరుస్తుంటే ఇదిగో ఇందుకే ఈ ఎగ్రెషన్ నచ్చలేదనే నేను తీసేశా అంటూ రెట్టించాడు. తర్వాత శోభాని అర్జున్ నామినేట్ చేశాడు. మజాక్ మజాక్ అని మనం అనుకుంటాం కానీ బయట చూసే ప్రజలు అనుకోరు.

ఇప్పటికైనా మార్చుకుంటే బెటర్ అని హితబోధ చేయబోయాడు. దీనికి శోభాశెట్టి మరోసారి యాటిట్యూడ్ చూపించింది. అర్జున్ ని తీస్కుని వస్తాను బిగ్ బాస్ మీరు కలర్ రెడీ చేస్కోండంటూ సెటైర్ వేస్తూ రెచ్చిపోయింది. నామినేషన్స్ లో మొత్తం 8మంది వచ్చారు. వాళ్లలో అమర్ దీప్, తేజ, యావర్, భోలే షవాలి, అర్జున్, శోభాశెట్టి, ప్రియాంక ఇంకా రతిక నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీళ్లలో ఈవారం (Bigg Boss 7 Telugu) ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఒక్కసారి చూసినట్లయితే.,

గతవారం ఓటింగ్ ప్రకారం చూస్తే ప్రియాంక ఇంకా శోభాశెట్టి ఇద్దరికీ తక్కువే ఓట్లు పడ్డాయి. అయితే, రతిక రీ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి రతిక రీ ఎంట్రీ ఓటింగ్ అనేది ఎక్స్ పెక్ట్ చేయలేమ్. అందుకే, ఈ ముగ్గురు అమ్మాయిల్లోనే ఎలిమినేషన్ జరగచ్చని బిగ్ బాస్ ఆడియన్స్ అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ శోభాశెట్టి వెళ్లిపోయినా , ప్రియాంక వెళ్లిపోయినా స్టార్ మా బ్యాచ్ బలం తగ్గిపోతుంది. మరి చూద్దాం.. ఓటింగ్ లో ఏం జరుగుతుంది అనేది. అదీ మేటర్.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus