‘మైత్రి’ ‘వాల్ పోస్టర్..’ తో పాటు హ్యాట్రిక్ హిట్లు కొట్టిన నిర్మాణ సంస్థల లిస్ట్..!

  • December 8, 2022 / 05:00 PM IST

టాలీవుడ్లో లీడింగ్ నిర్మాణ సంస్థలు అంటే అందరూ చెప్పేవి ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘గీతా ఆర్ట్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ గా చెప్పుకుంటారు. కానీ వీటిలో ఆరంభంలో హ్యాట్రిక్ కొట్టిన బ్యానర్ గా మాత్రం దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ మాత్రమే..! వరుస హిట్లు సాధిస్తే కచ్చితంగా ఆ బ్యానర్ పై జనాల్లో నమ్మకం పెరుగుతుంది. పెద్ద హీరోలు కూడా ఆ బ్యానర్లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.నిర్మాత ఎంత పెద్ద బడ్జెట్ పెట్టగలడు అన్నది ముఖ్యం కాదు..! తాను ఎంత బడ్జెట్లో సినిమాలు నిర్మించినా సక్సెస్ అందుకున్నాడా? లేదా? అన్నది ముఖ్యం. సక్సెస్ ట్రాక్ రికార్డ్ చాలా ముఖ్యమన్న మాట. కొన్ని నిర్మాణ సంస్థలు ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్లు కొట్టి టాప్ బ్యానర్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ బ్యానర్లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) శ్రీదేవి మూవీస్ :

శివలెంక కృష్ణ ప్రసాద్ గారు నిర్మించిన ఈ బ్యానర్లో రూపొందిన మొదటి మూడు సినిమాలు.. ‘చిన్నోడు పెద్దోడు’ ‘ఆదిత్య 369’ ‘వంశానికొక్కడు’ వంటివి సూపర్ హిట్ అయ్యాయి. శివలెంక కృష్ణ ప్రసాద్ గారు హ్యాట్రిక్ హిట్లు సాధించి ‘శ్రీదేవి మూవీస్’ ను టాప్ బ్యానర్ గా నిలబెట్టారు. ఇటీవల ‘యశోద’ వంటి సూపర్ హిట్ మూవీ కూడా ఈ బ్యానర్ నుండి వచ్చింది.

2) వైష్ణో అకాడమీ మూవీస్ :

పూరి జగన్నాథ్ స్థాపించిన బ్యానర్ ఇది. ఇప్పుడు ఉందో లేదో క్లారిటీ లేదు. అయితే ‘ఇడియట్’ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ‘శివమణి’ వంటి సినిమాలతో ఈ బ్యానర్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టి.. టాప్ బ్యానర్ గా నిలబెట్టాడు పూరి.

3) బొమ్మరిల్లు :

దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి స్థాపించిన ఈ బ్యానర్లో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘సీతయ్య’ ‘దేవదాసు’ వంటి హ్యటిక్ చిత్రాలు నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశాడు వై.వి.ఎస్.చౌదరి.

4) శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ :

దిల్ రాజు స్థాపించిన ఈ బ్యానర్.. ‘దిల్’ ‘ ఆర్య’ ‘భద్ర’ వంటి సినిమాలతో టాప్ బ్యానర్ అయిపోయింది.

5) శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ :

‘రా’ అనే కన్నడ డబ్బింగ్ సినిమాతో ఈ బ్యానర్ ను స్థాపించాడు నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి). ఆ సినిమా తెలుగులో కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ‘లక్ష్మీ’, ‘లక్ష్యం’ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి ఈ బ్యానర్ ను టాప్ బ్యానర్ గా నిలబెట్టాడు.

6) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ :

‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అఆ’ వంటి చిత్రాలతో ఈ బ్యానర్ ను టాప్ బ్యానర్ గా నిలబెట్టారు ఎస్.రాధాకృష్ణ(చినబాబు) గారు. టాలీవుడ్లో ఇప్పుడు ఇది టాప్ బ్యానర్.

7) మైత్రి మూవీ మేకర్స్ :

నవీన్ యెర్నేని, రవిశంకర్ లు… ‘శ్రీమంతుడు’ తో ఈ బ్యానర్ ను స్థాపించారు. ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’ ‘రంగస్థలం’ చిత్రాలతో హిట్లు కొట్టి దీనిని టాప్ బ్యానర్ గా నిలబెట్టారు.

8) 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ :

విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి.. లు ‘భలే మంచి రోజు’ ‘ఆనందో బ్రహ్మ’ ‘యాత్ర’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి టాప్ బ్యానర్ గా నిలబెట్టారు.

9) వాల్ పోస్టర్ సినిమా :

‘అ!’ ‘హిట్’ ‘హిట్2’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి ఈ బ్యానర్ ను టాప్ బ్యానర్ గా నిలబెట్టాడు నేచురల్ స్టార్ నాని.

10) స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ :

రాహుల్ యాదవ్ నక్కా ఈ బ్యానర్ ను స్థాపించి ‘మళ్ళీ రావా’ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్’ ‘మసూద’ వంటి సినిమాలను తీసి హ్యాట్రిక్ హిట్లు కొట్టి..దీనిని టాప్ బ్యానర్ గా నిలబెట్టారు.

11) యూవీ క్రియేషన్స్ :

‘మిర్చి’ ‘రన్ రాజా రన్’ ‘జిల్’ వంటి హ్యాట్రిక్ హిట్లతో ఈ బ్యానర్ ను టాప్ బ్యానర్ గా నిలబెట్టారు వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus