దట్ ఈజ్ మెగాస్టార్.. అనడానికి ఈ 10 రికార్డులే ప్రూఫ్..!

  • March 11, 2021 / 06:32 PM IST

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎక్కడో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరసాపురంలోని ఓ క్రిస్టియన్ హాస్పిటల్ లో జన్మించిన ఆయన.. ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీని యేలే మహారాజుగా ఎదిగారు. నటన పై ఉన్న మక్కువతో మద్రాసు(చెన్నై) కు వెళ్లిన ఆయన.. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. పెద్దవాళ్ళ దృష్టిలో పడ్డారు.డ్యాన్స్ లు ఫైట్ లతో కొత్త తరహా హీరోయిజాన్ని రుచి చూపించారు మెగాస్టార్ చిరంజీవి. ట్యాలెంట్ కు టైమింగ్ తోడైతే దాని అవుట్-పుట్ వేరే లెవెల్లో ఉంటుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా మెగా స్టార్ చిరంజీవి. 24 క్రాఫ్ట్స్ లోనూ ఆయనకు అవగాహన ఉంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరుచుంటూ ఆయన.. సొంత ట్యాలెంట్ తోనే పైకి వచ్చారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు.

ఈరోజున మెగా ఫ్యామిలీ నుండీ 8మంది హీరోల వరకూ ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్,బన్నీ,చరణ్,వైష్ణవ్ తేజ్,చరణ్,వరుణ్ తేజ్ వంటి హీరోల క్రేజ్ అంతా ఇంతా కాదు. అందరూ సక్సెస్ రేటుని మెయింటైన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 42ఏళ్ళ సినీ కెరీర్లో చిరంజీవి నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆయనకు మాత్రమే సాధ్యమైన 10 రికార్డుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం :

1) అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం అందుకున్న హీరోగా.. అదీ మొట్ట మొదటి సౌత్ హీరోగా రికార్డు సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి.

2) 1990 లలోనే ఒక్కో చిత్రానికి రూ.1.25 కోట్ల పారితోషికాన్ని అందుకుని మరే హీరోకి సాధ్యం కానీ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.

3) సౌత్ నుండీ ఆస్కార్ కు ఆహ్వానించబడ్డ మొట్ట మొదటి సౌత్ హీరోగా చిరంజీవి సంచలనం సృష్టించారు.

4)’ఘరానా మొగుడు’ చిత్రంతో రూ.10కోట్ల షేర్ ను రాబట్టిన మొదటి హీరోగా చిరు రికార్డు సృష్టించారు.

5)’ఇంద్ర’ చిత్రంతో రూ.30 కోట్ల షేర్ ను రాబట్టిన హీరోగా కూడా రికార్డు కొట్టారు మెగాస్టార్ చిరంజీవి.

6)’గ్యాంగ్ లీడర్’ ‘రౌడీ అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టిన ఘనత కూడా మెగాస్టార్ చిరంజీవిదే. ఈ 3 కూడా ఒకదానిని మించి మరొకటి అన్నట్టు కలెక్ట్ చేసాయి.

7) 5 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఏకైక టాలీవుడ్ హీరో చిరంజీవి. ఇప్పటికీ ఈ రికార్డుని ఏ హీరో బ్రేక్ చెయ్యలేకపోయాడు.

8) ఇండియన్ హీరోల్లో రూ.7కోట్ల పారితోషికం అందుకున్న మొట్ట మొదటి హీరో కూడా చిరంజీవే. ‘లగాన్’ చిత్రానికి గాను ఆమిర్ ఖాన్(6 కోట్లు) అందుకున్న పారితోషికం కంటే ఎక్కువ పారితోషికం చిరు అందుకున్నాడు.

9) టాలీవుడ్లో 7 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న మొట్ట మొదటి ఇండియన్ హీరో చిరంజీవి.

10)’బాహుబలి’ కాకుండా ‘ఖైదీ నెంబర్ 150’ తో నాన్ బాహుబలి చిత్రాల్లో మొట్ట మొదటి రూ.100కోట్ల షేర్ ను కొల్లగొట్టింది కూడా మెగాస్టార్ చిరంజీవే కావడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus