‘బాహుబలి’ టు ‘లైగర్’.. హిందీలో భారీ ఓపెనింగ్స్ ను సాధించిన సౌత్ సినిమాల లిస్ట్..!

కోలీవుడ్, టాలీవుడ్ కంటే కూడా బాలీవుడ్ అనేది చాలా పెద్ద మార్కెట్. అయితే కొంతకాలంగా బాలీవుడ్ జనాలని భారీ ఎత్తున థియేటర్లకు తీసుకొచ్చే సినిమాలు మన సౌత్ సినిమాలే కావడం విశేషంగా చెప్పుకోవాలి. బాలీవుడ్ సినిమాలను సౌత్ సినిమాలు భారీగా డామినేట్ చేస్తున్నాయి. అందుకు పెద్ద ఉదాహరణ ఇటీవల వచ్చిన ‘కార్తికేయ2’. మొదటి రోజు 47 స్క్రీన్స్ లో ఆ సినిమాని విడుదల చేశారు. తర్వాత 2000 కి పైగా స్క్రీన్స్ పెంచారు. ఇది మామూలు విషయం కాదు. యూట్యూబ్ లో కూడా అక్కడి జనాలు ఎక్కువగా చూసి ఎంజాయ్ చేసేది మన సౌత్ సినిమాలు.! ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా అక్కడ డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేయగా .. వాటికి వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదవుతూ ఉంటాయి. ఈ ఏడాది అయితే ఆర్.ఆర్.ఆర్, కె.జి.ఎఫ్ 2 వంటి చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి. లేటెస్ట్ గా వచ్చిన ‘లైగర్’ ‘కార్తికేయ2’ వంటి చిత్రాలు కూడా అక్కడ సత్తా చాటాయి. ఇప్పటివరకు మొదటి రోజు హిందీలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన సౌత్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ తొలి రోజు అక్కడ రూ.53.95 గ్రాస్ కలెక్షన్లను రాబట్టి.. హిందీలో అత్యధిక కలెక్షన్లను నమోదు చేసిన మూవీగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు బాలీవుడ్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీ అదే కావడం విశేషం.

2) బాహుబలి2 :

రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బాహుబలి2’ అక్కడ మొదటి రోజు రూ.41 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

3) సాహో :

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ మొదటి రోజు రూ.24.4 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

4) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రాంచరణ్ లు హీరోలుగా నటించిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.20.07 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

5)2.ఓ :

రజనీకాంత్ – శంకర్ – అక్షయ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ బాలీవుడ్లో మొదటి రోజు రూ.19.74 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.

6) లైగర్ :

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్లో మొదటి రోజు రూ.5.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7) బాహుబలి :

రాజమౌళి – ప్రభాస్- రానా కాంబినేషన్లో తెరకెక్కిన ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రం బాలీవుడ్లో మొదటి రోజు రూ.5.15 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

8) రాధే శ్యామ్ :

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్లో మొదటి రోజు రూ.4.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

9) జంజీర్(తెలుగులో తుఫాన్) :

రాంచరణ్ – అపూర్వ లఖియా కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు బాలీవుడ్లో రూ.3.58 గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

10) కబాలి :

రజినీకాంత్ – పా రంజిత్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు బాలీవుడ్లో రూ.3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

11) పుష్ప :

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు బాలీవుడ్లో రూ.3.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

12) సైరా :

చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు బాలీవుడ్లో రూ.2.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus