టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఎన్నో పౌరాణిక.. అలాగే మాస్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి 9 నెలలో వ్యవథిలోనే ముఖ్యమంత్రి అయ్యి రికార్డు కూడా సృష్టించాడు. అలాంటి ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ సుమారు 46 ఏళ్ళ నుండీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇది కూడా ఓ రికార్డు అనే చెప్పాలి. ఎన్టీఆర్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ కూడా ఎన్నో పౌరాణిక చిత్రాల్లో అలాగే మాస్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాల్లో నటించాడు. తండ్రికి తగినట్టుగానే డైలాగ్ లు కూడా నాన్ స్టాప్ గా చెప్పగలడు. అద్భుతమైన పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వగలడు. అందుకే ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. అప్పటి స్టార్ హీరోలలో ఒకడిగా నిలబడగలిగాడు. ఎంత మంది కుర్ర హీరోలు వచ్చినా .. ఇప్పటికి మాస్ హిట్లు కొడుతూనే ఉన్నాడు మన బాలయ్య. అయితే ఇప్పట్లో ఏ హీరోకి సాథ్యం కానీ ఓ రికార్డుని కూడా బాలయ్య క్రియేట్ చేసాడట.
గతేడాది తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ అయిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో నటించాడు బాలయ్య. ఆ చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా.. అతని తండ్రి స్థాయిలో నటించి మెప్పించాడు అనే ప్రశంసలు అందుకున్నాడు. ఇంతే కాదు తండ్రి ఎన్టీఆర్ తో బాలయ్య ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇంకో విశేషం ఏమిటంటే ఆ సినిమాలన్నీ దాదాపు హిట్లే కావడం విశేషం. ఇక బాలయ్య ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1)తాతమ్మ కల
2)అన్నదమ్ముల అనుబంధం
3)వేములవాడ భీమకవి
4)దాన వీర శూర కర్ణ
5) అక్బర్ సలీం అనార్కలి
6) శ్రీమద్విరాట పర్వము
7) శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం
8)రౌడీ రాముడు కొంటె కృష్ణుడు
9) అనురాగదేవత
10)సింహం నవ్వింది
11)శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
12)బ్రహ్మర్షి విశ్వామిత్ర