చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

భారతదేశంలో ప్రజలు ఎక్కువగా మాట్లాడుకునేది రెండే విషయాల గురించి అవి ఒకటి రాజకీయాలైతే, రెండోది సినిమాలు. రోడ్డు పక్కన టీ కొట్టు నుంచి విమానంలో జర్నీ చేసే సమయంలో ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకునే మెయిన్ టాపిక్స్ ఇవే. అంతగా భారతీయుల నిత్య జీవితంలో ఈ రెండూ భాగమైపోయాయి. అభిమాన తారలు, రాజకీయ నేతలను ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలో దీని మోతాదు కాస్త ఎక్కువ.

ఇక్కడ సినిమాలు, రాజకీయాలు ఒకదానితో ఒకటి ముడివేసుకుని వుంటాయి. బృందావనంలాంటి సినిమా రంగాన్ని వదిలి దంఢకారణ్యం లాంటి రాజకీయారణం లోకి దూకారు. సినిమా ‘రాజకీయం’ ద్వారా విజయం పొందినవారున్నారు. అనుకున్నంత ఆదరణ పొందలేక రాజకీయాల నుంచి తప్పుకున్న వారూ ఉన్నారు. అయితే సక్సెస్ కొట్టినవారి కంటే ఫెయిల్ అయిన వారే ఎక్కువగా వున్నారు. ఒకసారి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం రండి :

1)జగ్గయ్య :

1967లో కొంగర జగ్గయ్య ఒంగోలు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. భారతదేశంలో తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టిన వ్యక్తిగా జగ్గయ్య రికార్డుల్లోకెక్కారు. అనంతరం చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు.

2) ఎన్టీఆర్ :

సొంతంగా పార్టీ పెట్టి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.

3) ఎంజీఆర్‌ :

ఈయన కూడా సొంతంగా పార్టీ పెట్టి గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

4)జయలలిత :

ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీని గ్రిప్‌లోకి తీసుకున్న జయలలిత కూడా పలుమార్లు సీఎంగా గెలిచి.. జాతీయ రాజకీయాలను కూడా శాసించారు. వీరి బాటలోనే పలువురు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలను స్థాపించి చేతులు కాల్చుకున్నారు.

5) చిరంజీవి :

తెలుగు నాట ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ వున్న వ్యక్తిగా నిలిచిన చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 18 సీట్లనే గెలుచి తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

6)పవన్ కళ్యాణ్ :

అటు తర్వాత చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అయితే తొలి ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీలకు సపోర్ట్ చేశారు. అనతరం 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ స్వయంగా రెండు చోట్లా ఒడిపోయారు.

7) కమల్ హాసన్ :

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా సొంతంగా పార్టీ పెట్టి ఓటమి పాలయ్యారు. ,

8) విజయకాంత్ :

సీనియర్ హీరో విజయ్ కాంత్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణించలేకపోయారు.

9) కార్తీక్ :

హీరో కార్తీక్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయారు.

10) విజయ్ :

విజయ్ కి కూడా రాజకీయాలు కలిసిరాలేదు.

11) విజయ్ శాంతి :

ఈమె కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయింది.

12) ప్రకాష్ రాజ్ :

ఈ విలక్షణ నటుడికి కూడా రాజకీయాలు పెద్దగా కలిసిరాలేదు.

వీరందరినీ గమనించిన సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలు తనకు సరిపడవని గ్రహించి పొలిటికల్ ఎంట్రీని విరమించుకున్నారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus