చిరు, మహేష్ తో పాటు ఈ ఏడాది పక్క సినిమాలకు గొంతు సాయం చేసిన స్టార్స్ లిస్ట్..!

  • December 22, 2022 / 11:47 AM IST

ఓ సినిమాకు మరో హీరో సపోర్ట్ చేయడం మంచి విషయమే. దీని వల్ల సినిమాకి మంచి హైప్ ఏర్పడుతుంది. ఇద్దరు హీరోల అభిమానులు ఆ సినిమాని చూస్తారు. అందువల్ల ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయి. ఆ తర్వాత సినిమా నిలబడాలి అంటే అందులో జనాలను ఆకట్టుకునే కంటెంట్ ఉండాలి. అది వేరే విషయం. అయితే 2022 లో కొన్ని సినిమాల ప్రమోషన్స్ కు కొంతమంది స్టార్లు సాయం చేశారు. ముఖ్యంగా వేరే సినిమాల కోసం తమ వంతుగా గొంతు సాయం చేశారు. కొంతమంది వాయిస్ ఓవర్లు ఇవ్వడం.. మరికొంతమంది పాటలు పాడటం.. ఇలా ఏదో ఒక విధంగా పక్క సినిమాలకు సాయం చేశారు. ఆ స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) చిరంజీవి :

మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’, రణ్ బీర్ కపూర్- అలియా భట్ ల ‘బ్రహ్మాస్త్రం'(బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్) , పొన్నియన్ సెల్వన్-1( తెలుగు వెర్షన్) వంటి చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరు. గతంలో కూడా ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి.

2) మహేష్ బాబు :

పక్క సినిమాలకు సాయపడడానికి మహేష్ ముందే ఉంటాడు. గతంలో రెండు, మూడు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి- రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆచార్య’ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు మహేష్. కొరటాల శివ .. మహేష్ కు అత్యంత సన్నిహితుడు కావడం కూడా ఇందుకు కారణం అని చెప్పొచ్చు.

3) నవీన్ పోలిశెట్టి :

తన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రం దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె తెరకెక్కించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించాడు.

4) రాజమౌళి :

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రానికి మన దర్శక ధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించాడు.

5) నాని :

తన అక్క దీప్తి గంట దర్శకత్వం వహించిన ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీస్ ట్రైలర్ కు నాని వాయిస్ ఓవర్ అందించాడు. అలాగే ఈ సిరీస్ ను అతనే నిర్మించాడు.

6) రానా :

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియన్ సెల్వన్ పీఎస్-1’ ట్రైలర్ కు రానా వాయిస్ ఓవర్ అందించాడు.

7) శింబు :

రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది వారియర్’ చిత్రంలో బుల్లెట్ సాంగ్ ను పాడాడు. అలాగే ‘వరిసు'(తెలుగులో వారసుడు) చిత్రంలో ది తలపతి అనే పాటను కూడా పాడాడు.

8) శంకర్ కూతురు అధితి :

వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రంలో ‘రోమియోకి జూలియట్’ అనే పాటను పాడి అలరించింది.

9) అనిరుధ్ :

‘డిజె టిల్లు’ చిత్రంలో ‘పటాస్ పిల్ల’, రాధే శ్యామ్ లో ‘సంచారి’ వంటి పాటలను పాడాడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.

10) యువన్ శంకర్ రాజా :

‘రాధే శ్యామ్’ చిత్రంలో ‘ఈ రాతలే’ వంటి చార్ట్ బస్టర్ సాంగ్ ను పాడింది ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టరే..!

11) ఎన్టీఆర్ :

సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘విరూపాక్ష’ గ్లింప్స్ వీడియోకి మన యంగ్ టైగర్ వాయిస్ ఓవర్ అందించారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus