ఎన్నేళ్ళు అయినా ప్రేమకథల్లో క్లాసిక్స్ అంటే ఈ సినిమాలే..!

  • February 13, 2021 / 02:27 PM IST

‘ప్రేమ అనే పదాన్ని వర్ణించడానికి ఎన్ని పదాలు అయినా సరిపోవు. దానికి ఆరంభం ఎప్పుడు.. అంతం ఎప్పుడు అంటే సమాధానాలు చెప్పడం చాలా కష్టం. ప్రేమ లేకపోతే సృష్టే లేదు. ఎంత సంపాదించినా.. ఎన్ని సౌకర్యాలు ఉన్నా.. ప్రేమ లేనిదే బ్రతుకుతున్న తృప్తి కూడా ఉండదు’… ఆగండి… ఆగండి.. ఈ పదాలు విని కొంతమంది ఎమోషనల్ అవుతారు.. మరికొంత మంది ఈ పదాలు రాసిన వాళ్ళను అంటే నన్ను తిట్టుకుంటారని నాకు తెలుసు. ఇవి నేను చెప్పే డైలాగులు కాదు సుమీ. మన తెలుగు సినిమాల్లో.. ప్రేమని వర్ణించిన తీరు అలా ఉంది మరి. ఎన్ని కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చినప్పటికీ ప్రేమ కథలకు ఉండే ఆధారణే వేరు. ప్రేమ పేరుతో వచ్చే పాటలు కూడా మనకి హాయిగా అనిపిస్తుంటాయి.

ఇప్పడు ‘ప్రౌడ్ టు బి సింగిల్’ ‘సింగిల్ కింగులం’ అంటూ జెల్సీతో ప్రేమ పై సెటైర్లు వేస్తుంటాం కానీ.. టాలీవుడ్లో వచ్చిన ఈ ప్రేమ కథా చిత్రాలను చూస్తే.. వెంటనే ప్రేమించేస్తారు అని నేను అనను కానీ… ప్రేమ పైన అలాగే ప్రేమికుల పైన సెటైర్లు వెయ్యడం మాత్రం మానేస్తారు. తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఈ ప్రేమ కథా చిత్రాలు గుర్తుండిపోతాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1)దేవదాసు :

అంత డబ్బుండి.. అంత చదువు ఉండి.. ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక తాగుడికి బానిసవ్వడం ఏంటో అని అందరికీ అనిపించొచ్చు. లాజిక్ లేకపోయినా ఎమోషనల్ గా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రేమ అంటే దేవదాస్ ని బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునేలా చేసింది.

2) ప్రేమ్ నగర్ :

అదే ఫార్ములా.. కానీ టెంప్లేట్ వేరు.. ఫీల్ వేరు..! అక్కినేని మళ్ళీ మ్యాజిక్ చేసి ఈ చిత్రాన్ని కూడా క్లాసిక్ గా నిలబెట్టారు. ఇది కూడా బ్లాక్ బస్టరే..!

3) ఆరాధన :

ఎన్టీఆర్,వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. క్లాసిక్ కూడా..!

4) మరోచరిత్ర :

కె.బాలచందర్ తెరకెక్కించిన ప్రేమ కావ్యం ఇది. ఇది కూడా క్లాసిక్ అంతే..!

5) మజ్ను :

నాగార్జున నటించిన ట్రాజెడీ లవ్ స్టోరీ. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. నాగార్జునకు మొదటి హిట్ ను అందించింది.

6) అభినందన :

అప్పటి తరం వారందరూ ఈ సినిమాని సూపర్ హిట్ ను చేశారు. కావాలంటే మీరు కూడా చూడండి బ్లాక్ బస్టర్ అంటారు. పాటలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి.

7) ప్రేమ సాగరం :

టి. రాజేందర్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా క్లాసిక్ గా నిలిచింది.

8) గీతాంజలి :

అక్కినేని ఫ్యామిలీకి లవ్ స్టోరీలు బాగా సెట్ అవుతాయని మణిరత్నం మరోసారి నిరూపించాడు. ఇప్పటి తరం ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రానికి ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

9) సీతాకోక చిలుక :

భారతీ రాజా ప్రేమ కథా చిత్రాలకు స్పెషలిస్ట్ కదా. కాబట్టి ఇది కూడా చాలా స్పెషల్ అనమాట..!

10) ప్రేమ :

వెంకటేష్, రేవతి ల ఆల్ టైం హిట్ మూవీ ఇది. సురేష్ కృష్ణ దర్శకుడు.

11) ప్రేమికుడు :

శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది.

12) తొలిప్రేమ :

పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం కూడా ఓ ట్రెండ్ సెటర్ అంతే..!

13) గులాబీ :

కృష్ణవంశీ తెరకెక్కించిన సరికొత్త ప్రేమ కథ. ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది.

14) సీతారామ కళ్యాణం :

బాలయ్య నటించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ. ప్రేమకి సరికొత్త డెఫినిషన్.

15)ప్రేమ ఖైదీ :

ఇ.వి.విగారు తెరకెక్కించిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

16)ప్రేమ దేశం

17)ప్రేమికుల రోజు

18)నిన్నే పెళ్ళాడతా

19)ప్రేమించుకుందాం రా

20)నువ్వేకావాలి

21) సుస్వాగతం

22) ఖుషి

23)చిత్రం

24)ఒక్కడు

25)వర్షం

26)మనసంతా నువ్వే

27)ఏమాయ చేసావె

28)ఆరెంజ్

29)ఆర్య

30)మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

31)అర్జున్ రెడ్డి

32) జాను

33)నువ్వు వస్తావని

34)సఖి

35)మగథీర

36)నువ్వు నాకు నచ్చావ్

37)స్వయంవరం

38)ఓకే బంగారం

39)రాజా రాణి

40)బొంబాయి

41)నేను శైలజ

42)ప్రియమైన నీకు

43)ప్రేమమ్

44)ప్రేమకు వేళాయరా

45)మనసిచ్చి చూడు

46)డార్లింగ్

47)కృష్ణగాడి వీర ప్రేమగాథ

48)కుమారి 21ఎఫ్

49)ప్రేమిస్తే

50)అల్లరి ప్రియుడు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus