గతంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో చాలా సినిమాలు రూపొందాయి. మెగాస్టార్ చిరంజీవి ‘ముఠామేస్త్రి’, రాజశేఖర్ ‘ఎవడైతే నాకేంటి’ ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తర్వాత వీటి హవా తగ్గింది అనుకున్న టైంలో… మళ్ళీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చాయి.అందులో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయో తెలుసుకుందాం రండి :
1) లీడర్ :
రానా దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకుడు. 2010 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి మంచి ఫలితాన్ని అందుకుంది. ముఖ్యమంత్రి అయిన తండ్రి చనిపోతే.. విదేశాల నుండి తలకొరివి పెట్టడానికి వచ్చిన కొడుకు.. ఎందుకు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. అనే లైన్ తో కథ మొదలవుతుంది. సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
2) ప్రస్థానం :
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఒక డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.దేవా కట్టా ఈ సినిమాకు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రాణం. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ క్రిటిక్స్ ను మెప్పించి మంచి రెస్పాన్స్ అందుకుంది.
3) దరువు :
రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా సోసియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రూపొందినప్పటికీ.. పొలిటికల్ టచ్ కూడా ఉంటుంది. ‘సిరుతై’ శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఇది కూడా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ టీవీల్లో చూడడానికి బాగానే ఉంటుంది.
4) కెమెరామెన్ గంగతో రాంబాబు :
పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమానే..! పూరీ స్టైల్లో వేసే పొలిటికల్ సెటైర్స్ బాగుంటాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. టీవీల్లో బాగానే చూశారు.
5) ప్రతినిధి :
నారా రోహిత్ హీరోగా ప్రశాంత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2014 ఎలక్షన్స్ టైంలో రిలీజ్ అయ్యింది. దీనికి మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు.
6) లెజెండ్ :
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన మూవీనే. 2014 ఎలక్షన్స్ టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
7) నేనే రాజు నేనే మంత్రి :
దగ్గుబాటి రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమానే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
8) రంగస్థలం :
1985 టైంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పొలిటికల్ డ్రామా ఇది. సుకుమార్ డైరెక్షన్లో రాంచరణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
9) భరత్ అనే నేను :
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమానే. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి అలరించాడు. ఒక ఎడ్యుకేటెడ్ సీఎం అయితే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా చూపించాడు కొరటాల. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
10) యాత్ర :
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఘట్టాన్ని తీసుకుని మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డిగా నటించారు. సినిమా మంచి ఫలితాన్నే అందుకుంది.
11) ఎన్టీఆర్ మహానాయకుడు :
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఆధారం చేసుకుని రూపొందిన సినిమా ఇది. క్రిష్ దర్శకుడు. అయితే ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
12) యాత్ర 2 :
వై.ఎస్.ఆర్ మరణం తర్వాత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న ఒడుదుడుకులు, తర్వాత అతను సీఎం అవ్వడం వంటి అంశాలతో ఈ సినిమా రూపొందింది. సినిమా బాగుంటుంది కానీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.
13) గేమ్ ఛేంజర్ :
‘ఒకే ఒక్కడు’ వంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీని దేశమంతా మెచ్చేలా తీసిన దర్శకుడు శంకర్.. తెలుగులో తీసిన మొదటి సినిమా ఇది. ఇది కూడా పొలిటికల్ టచ్ ఉన్న మూవీనే. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.