Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ ఇదేనా..?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం హౌస్ మేట్స్ తో ఎవిక్షన్ అంటూ కన్ఫెషన్ రూమ్ లో ఓటింగ్ పెట్టాడు హోస్ట్ కింగ్ నాగార్జున. ఈ ఓటింగ్ లో అందరికంటే కూడా ప్రియకి ఇంకా లోబోకి ఎక్కువగా 4 ఓట్లు వచ్చాయి. దీంతో వీరిద్దరిలో ఒకర్ని హౌస్ నుంచీ పంపించమని మరోసారి ఓటింగ్ పెట్టాడు. ఇక హౌస్ మేట్స్ అందరూ ప్రియకి మద్దతు ఇవ్వడంతో లోబోని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. ఇక్కడే ఇది ఫేక్ ఎలిమినేషన్ అని హౌస్ మేట్స్ కి కొద్దిగా అర్దమైంది. కానీ, కన్ఫార్మ్ గా తెలియదు కాబట్టి సైలెంట్ అయిపోయారు.. విశ్వ ఫుల్ గా ఎమోషనల్ అయిపోయాడు. లోబో వెళ్లిపోతుంటే అస్సలు తట్టుకోలేకపోయాడు.

హోస్ట్ నాగార్జున లోబోని స్టేజ్ పైన నుంచోపెట్టాడు. హౌస్ మేట్స్ ని పలకరిస్తూ లోబో అందరికీ సజెషన్స్ ఇచ్చాడు. లాస్ట్ కి లోబో వెళ్లిపోబోతుంటే ఆపి, ఇది ఫేక్ ఎలిమినేషన్ అని, నువ్వు ఒక ప్రత్యేకమైన కాస్టూమ్ వేసుకుని సీక్రెట్ రూమ్ లో ఉండాలని చెప్పాడు నాగార్జున. దీంతో పట్టరాని సంతోషంతో లోబో మోకాళ్ల మీద కూర్చుని అభిమానులకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. శనివారం బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ ఇదే. ఇక అత్యంత నాటకీయంగా జరిగిన ఈ ఎలిమినేషన్ ప్రక్రియ చూసే ప్రేక్షకులకి మంచి కిక్ ఇచ్చింది. ఇక ఆదివారం ఎలిమినేషన్ లో భాగంగా శ్వేత హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిపోయింది.

ఓట్లు లీస్ట్ వచ్చిన నేపథ్యంలో శ్వేతని బిగ్ బాస్ హౌస్ నుంచీ ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆరోవారం సెట్ శ్వేత గేమ్ ముగిసిపోయింది. శ్వేత స్ట్రయిట్ ఫార్వర్డ్ గా గేమ్ ఆడటం, అందరికీ ఇచ్చిపారేస్తా అని ఎగ్రెసివ్ గా గేమ్ ఆడటం, సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడం, ఐదోవారం నామినేషన్స్ లోకి ఫస్ట్ టైమ్ రావడం ఇవన్నీ కూడా శ్వేత ఎలిమినేషన్స్ కి కారణాలు అయ్యాయి. ఇక శనివారం హోస్ట్ నాగార్జున ఒక్కరిని కూడా సేఫ్ చేయకపోవడం అనేది గమనార్హం. అదీ విషయం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus