DC Movie: ‘DC’ టైటిల్ టీజర్… వేశ్య వద్దకు వెళ్తున్న లోకేష్ కనగరాజ్..మామూలు బోల్డ్ కాదు!

లోకేష్ కనగరాజ్ కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. తెలుగులో కూడా అతని సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. ‘ఖైదీ’ ‘విక్రమ్’ వంటి సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ‘మాస్టర్’ ‘లియో’ ‘కూలీ’ వంటి సినిమాలు కూడా ఇక్కడ భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇక లోకేష్ ఇప్పుడు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ‘సన్ పిక్చర్స్’ సంస్థ పై కళానిధి మారన్… లోకేష్ హీరోగా డెబ్యూ ఇస్తున్న మూవీని నిర్మిస్తున్నారు.

DC Movie

‘రాకీ’ ‘సాణి కాయిదం’ ‘కెప్టెన్ మిల్లర్’ వంటి సినిమాలు తెరకెక్కించిన అరుణ్ మాధేశ్వరన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. దీనికి ‘DC’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా ‘DC’ టైటిల్ టీజర్ ని విడుదల చేశారు. 1:08 నిమిషాల నిడివి కలిగిన ఈ టైటిల్ టీజర్లో ఒళ్ళంతా రక్తం.. చేత్తో కత్తి పట్టుకుని.. సిగరెట్ కాలుస్తూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నడుచుకుంటూ రావడం.. అతని పేరు దేవదాస్ అని రివీల్ చేయడం జరిగింది. అతను చంద్ర(వామిక గబ్బి) అనే వేశ్య వద్దకు వెళ్తున్నట్టు స్పష్టంచేశారు.

ఇక ఆమె జడలో గులాబీ పువ్వు పెట్టుకుని నిరోధ్ ప్యాకెట్ తీసుకుని అతని కోసం ఒక గదిలోకి వెళ్లడం.. అక్కడ వాళ్లిద్దరూ ఎదురు పడటం.. అక్కడితో ఈ టైటిల్ టీజర్ ను కట్ చేశారు. ఇది చాలా బోల్డ్ గా ఉంది. ‘D’ అంటే దేవదాస్.. ‘C’ అంటే చంద్ర అని టైటిల్ కి క్లారిటీ ఇచ్చేశారు. రా అండ్ రస్టిక్ ఫీల్ కూడా కలిగిస్తుంది ఈ టైటిల్ టీజర్. సంగీత దర్శకుడు అనిరుధ్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. టీజర్ కి హైలెట్ అని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus