LEO Movie: లియో లో అదిరిపోయే ట్విస్ట్ ప్లాన్ చేసిన లోకేష్ కనగ‌రాజన్‌!

  • October 7, 2023 / 08:46 PM IST

విశ్వనటుడు కమల్ హాసన్ తో విక్రమ్ తీసిన లోకేష్ కనగ‌రాజన్‌ పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. ఆ సినిమా ఇచ్చిన జోష్ లో మరో సారి లియోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన కెరీర్లో చేసింది తక్కువ సినిమాలే అయినా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన ప్రస్తుతం దళపతి విజయ్ తో కలిసి తీసిన లియో సినిమాతో రాబోతున్నారు.

ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. యావరేజ్ సినిమాని కూడా వేరే లెవెల్‌కి తీసుకెళ్లి బ్లాక్ బాస్టర్ హిట్ చేసే సత్తా లోకేష్ కనగ‌రాజన్‌కు మాత్రమే ఉందన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ లో లియో అడ్వాన్స్ బుక్కింగ్స్.. సౌత్ ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్ట్ గ్రాస్ నెలకొలిపే దిశగా అడుగులు వేస్తున్నాయి.

కానీ దురదృష్టం ఏంటంటే ఈ సినిమాపై ఇప్పటివరకు జరిగిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో హైప్ తీసుకురాలేకపోయింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాలో విడుదలైన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స రాలేదు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సంజయ్ దత్ – విజమ్‌ కలిసి ఉన్న పోస్టర్ పై భారీ ట్రోలింగ్ కూడా జరిగింది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విక్రయ్ సినిమాకు లియోకు కనెక్షన్ ఉందట. విక్రమ్ సినిమాలో కూడా ఖైదీ సినిమాతో లింక్ ఉన్నట్లు చూపిస్తారు. ఇలా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ (LEO Movie) లియో సినిమా కూడా తెర‌కెక్కుతుంది అంటున్నారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus