లోకేష్ కనగరాజ్..ను ఏకంగా రాజమౌళితో పోల్చేశారు రజినీకాంత్.తమిళంలో అతను క్రియేట్ చేసుకున్న ఇంపాక్ట్ అలాంటిది. ‘ఖైదీ’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. వెంటనే విజయ్ ఇంప్రెస్ అయిపోయి వచ్చి ‘మాస్టర్’ చేశాడు. అది అంతగా ఆడలేదు. అయినా ‘లియో’ చేయడానికి అంగీకరించాడు. దాని ఫలితం కూడా తెలిసిందే. అయితే మధ్యలో ‘విక్రమ్’ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం వల్ల ‘లియో’ కి బాగా కలిసొచ్చింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లు కలెక్ట్ చేసింది. తమిళంలో ఇప్పటికీ ఆ సినిమా కలెక్షన్స్ ను ఏ సినిమా అధిగమించలేదు. అయితే ‘కూలీ’ కచ్చితంగా ‘లియో’ కలెక్షన్స్ ని అధిగమించి ఇండస్ట్రీ హిట్ కొడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో లేదు. ఈ సినిమాపై ఉన్న హెవీ ఎక్స్పెక్టేషన్స్ ను లోకేష్ మ్యాచ్ చేయలేకపోయాడు అనేది వాస్తవం. అలా అని లోకేష్ టాలెంట్ ను అనుమానించాల్సిన పనిలేదు.
నాగార్జున చెప్పినట్టు చెప్పిన బడ్జెట్ లో.. చెప్పిన టైంకి.. సినిమాని క్వాలిటీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో లోకేష్ సిద్ధహస్తుడు. అందుకే తమిళ స్టార్ హీరోలు లోకేష్ ను తక్కువ చేసి చూడటం లేదు. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం అయితే.. లోకేష్ తన నెక్స్ట్ ప్రాజెక్టుని కమల్ హాసన్ – రజనీకాంత్ వంటి బడా స్టార్స్ తో చేయబోతున్నాడట.
‘కూలీ’ రిజల్ట్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ మళ్ళీ లోకేష్ తో సినిమా చేయడానికి ఒప్పుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ మళ్ళీ ఇంత పెద్ద స్టార్స్ తో సినిమా చేస్తున్నప్పుడు చాలా హెవీ ప్రెజర్ ఉంటుంది. ప్రస్తుతం లోకేష్ కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో తలకి మించిన భారం పెట్టుకుంటే కష్టమే. ‘ఖైదీ 2’ ప్రాజెక్టుని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తాడు అనే ప్రశ్న కూడా మిగిలే ఉంది. చూడాలి మరి