ఓ చిన్న సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అమాంతం స్టార్ దర్శకుడు అయిపోయారు లోకేశ్ కనగరాజ్. గత రెండు సినిమాలు ఆశించిన మేర ఫలితం ఇవ్వకపోయినా, గత సినిమా చాలా ఇబ్బంది పెట్టినా లోకేశ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆయన నెక్స్ట్ సినిమా ‘ఖైదీ 2’ గురించి పెద్ద ఎత్తున హైప్ ఉంది. అయితే ఈ హైప్ ఆయన హీరోగా మారుతారు అన్నా కూడా వస్తోంది అంటే ఆశ్చర్యం కలగక మానదు.
మీకు తెలిసే ఉంటుంది. లోకేశ్ కనగరాజ్ ఇటీవల హీరోగా మారారు. ‘డీసీ’ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి కోలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే ఈ సినిమా కోసం లోకేశ్ కనగరాజ్‌కి భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనేదే ఆ చర్చ సారాంశం. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగులో ఎప్పుడో వచ్చి ఆ తర్వాత కనిపించకుండా వెబ్‌సిరీస్‌లతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న వామికా గబ్బి నటిస్తోంది.
ఇక అసలు విషయానికొస్తే.. ‘డీసీ’ సినిమా కోసం ఏకంగా రూ.30 కోట్లకుపైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు సన్ పిక్చర్స్ భారీ అంచనాలే పెట్టుకుందట. ఈ సినిమాలో హీరోగా లోకేశ్ కనగరాజ్ అదరగొడతాడు అని నమ్మి అంత మొత్తంలో పారితోషికం ఇస్తున్నారు అని టాక్. రజనీకాంత్ హీరోగా ఇటీవల వచ్చిన ‘కూలీ’ సినిమాను లోకేశ్ తెరకెక్కిస్తున్న సమయంలోనే హీరోగా సినిమా ఓకే అయిందట.
ఇక ఈ సినిమాలో వామికా గబ్బి వేశ్య పాత్రలో నటిస్తోందని ఇటీవల వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఇటీవల ఆమె సినిమాల ఎంపిక ఇలా వైవిధ్యంగా ఉంటూ వస్తోంది. ఆమె ఓకే చేసి నటిస్తోంది అంటే ఈ సినిమాలో ఏదో స్పెషల్ మేటర్ ఉందనే చెప్పాలి.