‘లవ్ అంటే నేనేలే’ పాట ను విడుదల చేసిన సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ‘లవ్ అంటే నేనేలే’ సాంగ్ ను సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. పాట కు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయి. తమ చిత్రంలోని పాటను జీనియస్ దర్శకుడు మణిరత్నం విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ గీతాన్ని మలేషియాలోని పలు సుందరమైన లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, దేవన్ ఆలపించారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus