Usha Parinayam Movie: మ్యూజిక్ లవర్స్ ను మెప్పిస్తున్న ఉషా పరిణయం సాంగ్.. సూపర్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు విజయ భాస్కర్ కు (K. Vijaya Bhaskar)  ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నువ్వే కావాలి, మన్మథుడు, మల్లీశ్వరి (Malliswari) సినిమాలతో ఈ దర్శకుడు ట్రెండ్ సెట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా నుంచి తాజాగా లవ్ ఈజ్ బ్యూటిఫుల్ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఆర్.ఆర్ ధ్రువన్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని రఘురామ్ లిరిక్స్ బాగున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సాంగ్ ను విన్న ప్రేక్షకులు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోందని సాంగ్ సూపర్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. విజయ భాస్కర్ కొడుకు శ్రీ కమల్ ఈ సినిమాలో హీరోగా నటించగా అచ్చ తెలుగమ్మాయి తాన్వీ ఆకాంక్ష శ్రీ కమల్ కు జోడీగా నటించారు.

ఆగష్టు నెల 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా లవర్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. సరికొత్త ప్రేమ కథాంశంతో ఈ సినిమా రూపొందగా విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకులు సైతం ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతి పాట ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ సాంగ్ ను ఆర్.ఆర్.ధ్రువన్, అదితి భావరాజు ఆలపించగా తమ గాత్రంతో ఈ సింగర్స్ ప్రాణం పోశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉషా పరిణయం చిన్న సినిమాలలో పెద్ద హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus