Love Me Twitter Review: ‘లవ్ మీ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • May 25, 2024 / 11:18 AM IST

దిల్ రాజు (Dil Raju)  వారసుడు ఆశిష్ (Ashish Reddy) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’ (Love Me) (ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక). ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి (Harshith Reddy) , హన్షిత రెడ్డి (Hanshitha Reddy) , నాగ మల్లిడి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ భీమవరపు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ఇది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుండీ మంచి మార్కులు రాబట్టుకున్నాయి. కీరవాణి  (MM Keeravani)  ,పీసీ శ్రీరామ్ (P. C. Sreeram)  వంటి లెజెండ్స్ ఈ సినిమాకి పనిచేశారు.

హార్రర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘లవ్ మీ’ ఫస్ట్ హాఫ్ సాదా సీదాగా ఉందట. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో హర్రర్ ఎలిమెంట్స్ , కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మెప్పిస్తాయట.

అంతర్లీనంగా ఓ చిన్న మెసేజ్ కూడా ఉన్నట్టు చూసిన వాళ్ళు చెబుతున్నారు. మొత్తంగా ‘లవ్ మీ’ అబౌవ్ యావరేజ్ అనే విధంగానే ఉంటుందట. అయితే చాలా కాలంగా సరైన సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ డల్ అయిపోయింది. కొంతలో కొంత ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే ఛాన్స్ ఉందని అంతా అంటున్నారు. మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags