నేను శైలజ మూవీతో కీర్తి సురేష్ (Keerthy Suresh) తెలుగులో తొలి అడుగుతోనే హిట్ కొట్టింది. నేను లోకల్ తో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకుంది. తమిళంలోనూ ఆమె నటించిన రెమో కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం పట్టేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఆ ప్రభావం ఆమెపై అసలు పడలేదు. ప్రస్తుతం సావిత్రి బయోపిక్ కోసం కష్టపడుతోంది. అలాగే విక్రమ్ తో సామి 2 తో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఆమె ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. తక్కువ సమయంలో ఇంత బిజీ హీరోయిన్ ఎలా అయ్యారంటూ? విలేకరులు ఆమెను ప్రసవించగా నవ్వుతూ సమాధానమిచ్చింది.
‘నా సినీ ప్రయాణంలో అద్భుతాలు జరగాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఒకొక్క అడుగే ముందుకేస్తున్నా. నేనిప్పుడు ఎక్కడున్నాను? ఏ స్థాయికి ఎదిగాను? అని ఎప్పుడూ లెక్కలేసుకోను. నేనింకా అంత దూరం కూడా ప్రయాణం చేయలేదు. అందుకే వచ్చే అవకాశాలపైనా, వాటికి న్యాయం చేయడంపైనే నా దృష్టంతా.” అని వివరించింది. మరి పాత్రల సెలక్షన్ లో ఏమైనా అజాగ్రత్తలు తీసుకుంటున్నారా? అంటే. ” పాత్రల విషయంలో కూడా ప్రత్యేకమైన ప్లాన్స్ లేవు. కాకపోతే ఎప్పుడూ ఒకే రకంగా తెరపై కనిపించకుండా, ప్రేక్షకులకు. నాకూ చేసే పాత్రలు కొత్తగా అనిపిస్తే చాలు అనుకుంటాను. కానీ ఇంత తక్కువ సమయంలోనే మరిచిపోలేని కొన్ని పాత్రలు లభించాయి. అవి గుర్తుకొచ్చినప్పుడే నేను లక్కీ అనుకొంటుంటా” అని కీర్తి వెల్లడించింది.