Bigg Boss 8 Telugu: సోనియా మూడు హగ్గులు.. వైరల్ అవుతున్న ‘బిగ్ బాస్ 8’ లేటెస్ట్ ప్రోమో.!

బయట లగ్జరీ లైఫ్ గడిపొచ్చిన సెలబ్రిటీలకు సైతం.. లగ్జరీ బడ్జెట్ కోసం నానా తిప్పలు పెడుతుంటాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా వారికి ఇచ్చే టాస్కులు చాలా వివాదాలకు దారి తీస్తుంటాయి. ‘బిగ్ బాస్ 8’ (Bigg Boss 8 Telugu) లో కూడా లగ్జరీ బడ్జెట్లో భాగంగా రేషన్ కోసం పెట్టిన టాస్క్ హౌస్మేట్స్ ని బాధ పెట్టింది. రేషన్ కోసం ఏర్పాటు చేసిన ఓ టాస్క్ లో భాగంగా ‘సరుకులు గెలిచేదెవరో.. ఒట్టి చేతులతో వెనుదిరిగేదెవరో’ అన్నట్టు వారికి చివరిగా ఓ టాస్క్ ఇచ్చాడు.

Bigg Boss 8 Telugu

ఇందుకోసం నిఖిల్ (Nikhil) టీమ్ నుండి మణికంఠ ( Naga Manikanta).. నైనిక టీమ్ నుండి సీత (Kirrak Seetha ) ఈ గేమ్‌లో పోటీ పడేందుకు రంగంలోకి దిగారు. హౌస్‌ మొత్తంలో ఒక్కో చోట కొన్ని ఫుడ్ ఐటెమ్స్ పెట్టాడు బిగ్‌బాస్. అతను ఏం పలికితే.. అది తగిన మోతాదులో తెచ్చి పెట్టాలి.ఈ క్రమంలో శనగపప్పు అని చెప్పగానే మణికంఠతో పోటీ పడి ముందుగా తెచ్చిపెట్టింది సీత. తర్వాత టమాటో బుట్టలో యాపిల్‌ని అడగ్గా మణికంఠ ముందుగా తెచ్చిపెట్టాడు.

తర్వాత మరమరాలు అడిగాడు బిగ్‌బాస్ (Bigg Boss 8 Telugu) . దీని తూకం కోసం యష్మీని (Yashmi Gowda) సంచాలక్ గా పెట్టాడు. మణికంఠ ముందుగా కాస్త దగ్గరగా తెచ్చినప్పటికీ… యష్మీ పాయింట్ ఇవ్వలేదు. దీంతో మణికంఠ ‘ఇదెక్కడి అన్యాయం’ అంటూ ఆర్గ్యుమెంట్..కి దిగాడు. ‘సంచాలక్ చెప్పింది ఫైనల్’ అంటూ యష్మీ ఘాటుగా సమాధానం ఇచ్చింది.తర్వాత సీతని విన్నర్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ  (Bigg Boss 8 Telugu)ప్రోమో వైరల్ అవుతుంది.

 ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్లో అకీరా డెబ్యూ.. నిహారిక ఏమందంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus