నడిగర్ సంఘానికి ‘లైకా’ ఛైర్మెన్ రూ. కోటి విరాళం..!
- April 30, 2016 / 02:17 PM ISTByFilmy Focus
లైకా గ్రూప్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మెన్ అల్లిరాజా సుబస్కరన్ నడిగర్ సంఘానికి రూ.కోటిలను విరాళంగా ఇచ్చాడు. శుక్రవారం కమల్ హాసన్ నటించనున్న ‘శభాస్ నాయుడు’ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ మొత్తాన్ని నడిగర్ సంఘ జనరల్ సెక్రటరీ విశాల్ కు అందజేశాడు.
మరోవైపు నడిగర్ సంఘ ఆధీనం లో ఉన్న బాల మందిర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను.. కమల్ హాసన్ రూ. 2.5 లక్షలను చెల్లించాడు. ఈ సందర్భంగా నడిగర్ సంఘ అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ వీలైనన్ని చిత్ర సంబంధ కార్యక్రమాలు ఇక్కడ జరుపుకోవాలని ఆయన కోరారు. కాగా త్రిభాష చిత్రంగా తెరకెక్కుతున్న ‘శభాష్ నాయుడు’.. చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












