ఒకప్పటి బిజీయస్ట్ లిరిక్ రైటర్ ఇప్పుడు గుళ్ళో దొంగతనాలు చేసే స్థాయికి దిగజారిపోయాడు. అతనెవరో కాదు అప్పట్లో తేజ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు పాటల రచయితగా పనిచేసిన కులశేఖర్. అతి తక్కువ కాలంలోనే దాదాపు 100 సినిమాలకు పాటలు రాయడమే కాకుండా ఒక సినిమా డైరెక్ట్ కూడా చేశాడు. “చిత్రం, జయం, వసంతం, ఘర్షణ, 10 క్లాస్, నువ్వు నేను, మృగరాజు, ఔనన్నా కాదన్నా, ఇంద్ర” లాంటి సినిమాలకు పాటలు రాసిన కులశేఖర్ సడన్ గా పోలీస్ స్టేషన్‌లో కనబడ్డాడు. గుళ్ల దగ్గర బ్యాగులు, సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నాడనే కంప్లైంట్ కారణంగా రాజమండ్రి జైలులో ఆరు నెలలు జైల్లో ఉన్నాడు కులశేఖర్.
గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కారణంగా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడని వినికిడి. ఏదేమైనా.. ఒక రచయితగా, దర్శకుడిగా విశేషమైన పేరు తెచ్చుకొన్న కులశేఖర్ ఇలా అనాధగా మిగిలిపోవడం, పట్టించుకొనే నాధుడు లేకపోవడం చాలా బాధాకరం. కెరీర్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోవడమే కాదు, మెంటల్ ప్రెజర్ ను డీల్ చేయడం రాకపోయినా భవిష్యత్ ఇలాగే ఉంటుంది.