Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

  • July 29, 2026 / 12:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశి విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’ (Agadha). ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, సిజ్జు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఆల్రెడీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. తాజాగా ‘ది ఆరిజిన్ ఆఫ్ అగధ’ అంటూ చిత్రం గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు.

ఎంఎస్ రాజు మాట్లాడుతూ .. ‘ఇప్పటికి నేను ఎన్ని సినిమాలు నిర్మించినా, దర్శకుడిగా చేసినా సాలిడ్‌గా సిమెంట్ ఫ్లోర్ మీద నిల్చున్నట్టు ఉండదు.. ప్రతీ ఫిల్మ్ ఒక కొత్త అనుభవం.. ప్రతీదీ ఒక ఛాలెంజ్. నా కెరీర్‌లో ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలన్నీ కథగా, స్క్రీన్ ప్లే పరంగా నాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ ‘అగధ’కి అలాంటి ఛాలెంజ్‌లే ఎదురయ్యాయి. ఈ కథను అనుకున్నప్పుడే ఇలాంటి ఛాలెంజ్‌లు, ఇలాంటి యుద్ధం ఉంటుందని అనుకున్నాను. ఆడియెన్స్ ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో రాష్ట్రాలు తిరిగాను.. ఈ మూఢ నమ్మకాలు, అలాంటి గ్రామాలు, ప్రజల్ని సందర్శించాను. ఒక ఇంటికి వెళ్లాను. అక్కడ ఒకామె దెయ్యాల్ని వదిలిస్తూ కనిపించారు.ఆ పాత్రని నేను తీసుకున్నాను. ఆ కారెక్టర్‌కి మహాదేవి అని పేరు పెట్టాను. ఈ కారెక్టర్‌కి ధీటుగానే సింహ పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాను. శ్రవణ్ రెడ్డిలో నాకు సింహ కనిపించాడు. ఇలాంటి ఓ మూవీని చేయాలంటే మంచి ప్రొడక్షన్ కావాలి. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్, కాశి విశాలాక్షి గారు నాకెంతో సపోర్ట్ చేశారు. వారి సహకారం వల్లే నేను పూర్తిగా సినిమా మీద ఫోకస్ పెట్టగలిగాను. ఉల్కా అనే పాత్రను ముంబై నుంచి వచ్చిన నటి చేశారు. జోవిక, షిజు అద్భుతంగా నటించారు. నాని కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. కథకి, స్క్రీన్ ప్లే కోసం చాలా రీసెర్చ్ చేశాం. సినిమాని ఓన్ చేసుకుని నటించే ఆర్టిస్టులు కావాలని అనుకున్నాను. నాకు అద్భుతమైన ఆర్టిస్టులు దొరికారు. చైతన్య స్క్రిప్ట్ వర్క్‌లో, అడిషనల్ స్క్రీన్ ప్లేలో సహాయం చేశాడు. నాకు వచ్చిన డ్రీమ్ ఏంటో.. ఆగస్ట్ 14న ప్రేక్షకులందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘ఎంఎస్ రాజు గారు తెలుగు సినిమాకి ఓ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆయనలాంటి గొప్ప ఫిల్మ్ మేకర్‌తో పని చేస్తునాన్నని తెలియడంతో ఎంతో సంతోషించాన. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘అగధ’ జర్నీ నాకెంతో నచ్చింది. నేను కూడా ఎంతో రీసెర్చ్ చేశా. ఇలాంటి పీపుల్స్ ఎలా ఉంటారు? వారి దినచర్య ఏంటి? అన్నది కూడా తెలుసుకున్నాను. ప్రతీ సీన్ యూనిక్‌గా ఉంటుంది. గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఆగస్ట్ 14 మా సినిమా రాబోతోంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ .. ‘రాజు గారితో నేను చేసిన ‘డర్టీ హరి’తో పోల్చితే ఇదొక కొత్త అనుభవం. ఇందులో నా పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఎన్నో లేయర్స్ ఉంటాయి. డిఫరెంట్ లొకేషన్లలో షూట్ చేశాం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చిత్రీకరణ చేశాం. ఇదొక ఆఫ్ బీట్ సినిమా. ఈ ప్రయాణంలో నేను ఎంతో నేర్చుకున్నాను’ అని అన్నారు.

ఉల్కా గుప్తా మాట్లాడుతూ .. ‘‘అగధ’లో పని చేయడం ఆనందంగా ఉంది. ఎంఎస్ రాజు గారు లెజెండరీ పర్సన్. ఆయనతో పని చేయడం వల్ల ఎంత నేర్చుకున్నాను. ఆగస్ట్ 14న మా మూవీ రాబోతోంది. మా సినిమాతో మా అందరికీ విజయం లభిస్తుంది’ అని అన్నారు.

జోవికా విజయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘ఎంఎస్ రాజు గారు విజనరీ ఫిల్మ్ మేకర్. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. హరిణి అనే పాత్రను పోషించడం ఎంతో గర్వంగా ఉంది. ఆగస్ట్ 14న సినిమా విడుదల కాబోతోంది’ అని అన్నారు.

కాశి విశాలాక్షి బలుసు మాట్లాడుతూ .. ‘‘రాజు గారిలా గొప్ప చిత్రాల్ని నిర్మించాలని అనుకున్నాం. ఆయన మాకు కథ చెప్పినప్పటి కంటే.. ఫస్ట్ కాపీ చూసినప్పుడు పదింతలు ఆశ్చర్యపోయాను. సినిమా అద్భుతంగా వచ్చింది. విజయం అనేది కేవలం అదృష్టం వల్లే వరించదు. కష్టపడే తత్వం, సహనం వల్లే విజయాలు చేకూరుతాయి. ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు అని రాజు గారితో చెబుతూనే ఉండేవాళ్లం’ అని అన్నారు.

కెమెరామెన్ నాని చమిడి శెట్టి మాట్లాడుతూ .. ‘‘అగధ’ సినిమా ఇంత బాగా రావడానికి అందరూ కష్టపడ్డారు. కాస్ట్యూమ్ డిజైనర్ మహి చాలా సపోర్ట్ చేశారు. కలర్ ప్యాలెట్ ఇంత బాగా రావడానికి ఆమె కూడా ఓ కారణం’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాకేష్ వెంకటాపురం మాట్లాడుతూ .. ‘రాజు గారు ఎంతో మంది లెజెండరీ సంగీత దర్శకులతో పని చేశారు. నన్ను మ్యూజిక్ దర్శకుడిగా ఎంచుకున్నప్పుడు ఆనందమేసింది. ఇదొక ఆర్డినరీ మూవీ అయితే కాదు. ఈ కథకు డిఫరెంట్ సౌండ్ ప్యాలెట్ కావాల్సి వచ్చింది. బీజీఎంను థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేస్తే కొత్త ఫీలింగ్ వస్తుంది’ అని అన్నారు.

ఎడిటర్ జునైద్ సిద్దిఖీ మాట్లాడుతూ .. ‘‘అగధ’ ఎడిటింగ్ ప్యాలెట్ కొత్తగా ఉంటుంది. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుంది. కథను అస్సలు ఊహించలేరు’ అని అన్నారు.

చైతన్య వేగి మాట్లాడుతూ .. ‘‘అగధ’ ఎంతో క్లిష్టమైన చిత్రం. ఎన్నో ఇంపార్టెంట్ కారెక్టర్స్ ఉంటాయి. ఎన్నో ట్రాక్స్ ఉన్నాయి. ఎంతో కాంప్లెక్స్ ఉన్న కథను రాజు గారు తనకున్న అనుభవంతో ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేశారు’ అని అన్నారు.

ఆర్డ్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ మాట్లాడుతూ .. ‘‘అగధ’ ఒక డిఫరెంట్ చిత్రం. సెట్స్ చాలా కొత్తగా ఉంటాయి. రాజు గారిని ఒప్పించడమే నాకు ఓ సవాల్‌గా ఉండేది’ అని అన్నారు.

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి  రచన – దర్శకత్వం: ఎం.ఎస్. రాజు,
సమర్పణ: అజయ్ కేఆర్,
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు,
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్,
సంగీతం: రాకేష్ వెంకటాపురం,
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి,
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ,
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్,
అదనపు స్క్రీన్‌ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.వి.ఎన్. సుబ్బరాజు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agadha
  • #kamakshi bhaskarla
  • #M.S.Raju
  • #Shravan Reddy

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version