Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 8, 2026 / 11:02 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
M4M Review in Telugu: M4M సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సంబీత్ ఆచార్య (Hero)
  • జో శర్మ (Heroine)
  • శుభలేఖ సుధాకర్,సత్య కృష్ణన్, పసునూరి శ్రీనివాస్, గీతా భాస్కర్, కృష్ణ తేజ తదితరులు (Cast)
  • మోహన్ వడ్లపట్ల (Director)
  • మోహన్ వడ్లపట్ల (Producer)
  • వసంత్ (Music)
  • సంతోష్ షనమోని (Cinematography)
  • ఆనంద్ పవన్ (Editor)
  • Release Date : 8th మే 2026
  • మోహన్ మీడియా క్రియేషన్స్ (Banner)

మే 2వ వారం కూడా అంతగా క్యూరియాసిటీ క్రియేట్ చేసే సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. కంటెంట్ బాగుంటే తప్ప.. దేనికీ మంచి రీచ్ వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ పెద్ద సినిమాలు లేని స్పేస్ ను వాడుకోవాలని చిన్న సినిమా మేకర్స్ డిసైడ్ అయ్యి చాలా కాలంగా దాచుకున్న సినిమాలను వదులుతున్నారు. అలా ఈ వారం వస్తున్న చిన్న సినిమాల్లో ‘M4M’ (Motive for Murder) ఒకటి. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి:

M4M (Motive for Murder) Movie Review

M4M Movie Review and Rating

కథ: సి హెచ్ వాసుదేవ్ అనే రైటర్ తన అనుభవాలను ఆధారం చేసుకుని ‘M4M’ (Motive for Murder) అనే పుస్తకాన్ని రచించి మార్కెట్లోకి వదులుతాడు. అందులో నగరంలో జరిగే సీరియల్ కిల్లింగ్స్ గురించి, కిల్లర్ మోటివ్ గురించి కొన్ని నిజాలు ఉంటాయి. అయితే ఆ బుక్..ని ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది. ఇది జరిగిన కొద్దిరోజులకి రంజిత్(కృష్ణ తేజ) అనే స్టార్ హీరో దారుణ హత్యకు గురవుతాడు. అతన్ని కిల్లర్ అతి దారుణంగా చంపేసి ఓ పెయింటింగ్ ఆకారంలో న్యూడ్ గా పెట్టేసి పరారవుతాడు. ఆ కేసుని దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగుతాడు ఏసీపీ కృష్ణ(సంబీత్ ఆచార్య). అతని భార్య రాధ(జో శర్మ) లెజిట్ న్యూస్ అనే మీడియా ఛానల్లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. రంజిత్ మర్డర్ కేసుని రాధ కూడా దర్యాప్తు చేస్తుంటుంది.ఆ రకంగా తన భర్త కృష్ణకి సహాయపడుతూ ఉంటుంది. అయితే ఇంతలో మరికొన్ని సీరియల్ కిల్లింగ్స్ జరుగుతాయి. వాళ్ళని కూడా క్రిమినల్ కొన్ని పెయింటింగ్స్ ఆకారంలో పెడతాడు. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతను చేస్తున్న మర్డర్స్ వెనుక ఉన్న మోటో ఏంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి వాసు దేవ్ రాసిన ‘M4M’ పుస్తకం రాధ, కృష్ణ..లకి అవసరం పడుతుంది. దాని సాయంతో చివరికి ఆ సీరియల్ కిల్లర్ వీరు పట్టుకోగలిగారా? అనేది మిగిలిన కథ.

M4M Movie Review and Rating

నటీనటుల పనితీరు: సంబీత్ ఆచార్య ఓ ఒడియా యాక్టర్. తెలుగులో సినిమాలు చేశాడు కానీ ఇప్పటివరకు అతనికి గుర్తింపు రాలేదు. అయినప్పటికీ ‘M4M’ తో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏసీపీ కృష్ణ పాత్రలో అతను సెట్ అయ్యాడు. కానీ నటన పరంగా ఏమాత్రం మెప్పించలేదు. ఇతని పాత్రకి ఎలివేషన్స్ ఇచ్చే స్కోప్ ఉన్నా.. దర్శకుడు ఎందుకో ఆ ఛాన్స్ తీసుకోలేదు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా హీరోయిన్ జో శర్మకే అప్పగించి.

ఇతన్ని ఫోన్ కాల్స్ మాట్లాడటానికి మాత్రమే పరిమితం చేశారు. పోనీ జో శర్మ అయినా తన నటనతో మెప్పించిందా అంటే అలాంటిదేమీ లేదు. ఆమె పాత్రకి లిప్ సింక్ కూడా సెట్ అవ్వలేదు. ఎక్స్ప్రెషన్స్ పలికించలేకపోయింది. మరోవైపు కీలక పాత్రలు చేసిన శుభలేఖ సుధాకర్, గీతా భాస్కర్(తరుణ్ భాస్కర్ తల్లి) వంటి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు. ముఖ్యంగా గీతా భాస్కర్ నుండి ఇలాంటి పాత్ర ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రల్లో ఇది మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

M4M Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు మోహన్ వడ్లపట్ల గతంలో ‘మెంటల్ కృష్ణ’ ‘కలవరమాయే మదిలో’ వంటి విభిన్నమైన సినిమాలు నిర్మించారు. ఆయన దర్శకుడిగా మారి చేసిన సినిమా ఇది. థ్రిల్లర్ సినిమాలు అనేసరికి కొన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆడియన్స్ కూడా వాటికి ఫిక్స్ అయిపోయారు. సస్పెన్స్, డ్రామా, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. ఇవన్నీ సరితూగినప్పుడే థ్రిల్లర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతాయి. వరల్డ్ సినిమా చూడటం మొదలుపెట్టిన తర్వాత ఆడియన్స్ బాగా షార్ప్ అయిపోయారు. సినిమాలో నెక్స్ట్ వచ్చే సన్నివేశాలు వాళ్ళు ముందుగానే అంచనా వేయడంలోనే కాదు…ట్విస్టులను సైతం ముందే పసిగట్టేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళని మెప్పించడానికి దర్శకుడు ఏ రేంజ్లో మెదడు పెట్టాలి? కథనంలో ఏ రేంజ్ చిక్కు ముడులు వేసుకోవాలి? ఆ చిక్కుముడులు విప్పే టైంలో డ్రామా ఏ రేంజ్లో పండాలి.? అలాంటి విషయాలపై దర్శకుడు దృష్టి పెట్టలేదు.

ఐడియా పరంగా ఓకె. కానీ ఎగజిక్యూషన్ విషయంలో ఫస్ట్ సీన్ నుండి కథనం చాలా లేజీగా, ప్రెడిక్టబుల్ గా సాగుతున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది.సెకండాఫ్ కోసం దాచిన సస్పెన్స్ ఆసక్తికరంగా లేదు. క్లైమాక్స్ లో కథనంతో ట్రావెల్ కాని ఒక పాత్రని తీసుకొచ్చి అతనే కిల్లర్ అంటే ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు.? పోనీ అతను అంత క్రూయల్ గా మర్డర్స్ చేయడానికి గల మోటివ్ ని కూడా గొప్పగా వివరించారా? అదీ లేదు. సింపుల్ గా ఓ డిసార్డర్ పేరు చెప్పి మమ అనిపించేశారు. ‘M4M’ విషయంలో జరిగిన మిస్టేక్స్ ఇవే. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చెప్పుకోదగిన విధంగా లేవు. సింగిల్ కెమెరాతో లాగించేసినట్టు ఉన్నారు. అలాగే సీన్ కి సీన్ కి మధ్య వచ్చే సడన్ జంప్స్ వంటివి కూడా ఆడియన్స్ మూడ్ ను డిస్టర్బ్ చేస్తాయి. రన్ టైం గంటన్నరే ఉన్నప్పటికీ 3 గంటల పాటు సీట్లలో కూర్చున్న ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగింది అంటే అది స్క్రీన్ ప్లే లోపమే అని చెప్పడంలో అనుమానం అవసరం లేదు.

M4M Movie Review and Rating

విశ్లేషణ: సస్పెన్స్ థ్రిల్లర్ లేదా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే వాటిలో గ్రిప్పింగ్ నెరేషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వంటివి సమపాళ్లలో ఉండాలి. అవి మిస్ అవ్వడం వల్లనే ‘M4M’ ఓ వృధా ప్రయత్నంగా మిగిలిపోతుంది అని చెప్పాలి.

M4M Movie Review and Rating

ఫోకస్: మోటివ్ మిస్ అయిన మూవీ

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #M4M Movie

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

8 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

11 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

16 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 days ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 days ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version