టాలీవుడ్ లో ‘మా’ ఎలెక్షన్స్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి చాలా మంది పోటీ చేస్తున్నారు. వీరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ లాంటి వారు ఉన్నారు. అయితే కొన్నిరోజులుగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నవారు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా నటి హేమ.. ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడు నరేష్ పై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఆమెకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
‘మా’ అసోసియేషన్ లో నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ నరేష్ పై హేమ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై స్పందించిన నరేష్.. హేమ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని.. ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. రోజురోజుకి మా ఎలెక్షన్స్ గొడవలు ముదిరిపోతుండడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
‘మా’ ఎన్నికలు వెంటనే జరపాలని.. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతుందని.. ‘మా’ ప్రతిష్ట దెబ్బతీస్తున్న వారెవరినీ ఉపేక్షించవద్దని చిరంజీవి.. కృష్ణంరాజుకు లేఖ రాశారు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!