సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా రూపొందిన ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero) చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వి సెల్యులాయిడ్స్’ ‘కామ్ ఎంటర్టైన్మెంట్’..సంస్థల పై సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో షాయాజీ షిండే (Sayaji Shinde), సాయి చంద్ (Sai Chand) ..లు ముఖ్య పాత్రలు పోషించారు.మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది..కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా టాక్ కి తగినట్టు కలెక్ట్ చేయలేదు.దసరా సెలవులను ఎంతమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.
ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 0.35 cr |
సీడెడ్ | 0.10 cr |
ఉత్తరాంధ్ర | 0.19 cr |
ఈస్ట్ | 0.08 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.11 cr |
కృష్ణా | 0.16 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.08 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.09 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 1.17 cr |
‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.2 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.1.17 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.03 కోట్ల షేర్ ను రాబట్టాలి.